Asianet News TeluguAsianet News Telugu

నిండు సభలో భార్యపై అనుచిత వ్యాఖ్యలు... బోరున విలపించిన చంద్రబాబును పరామర్శించిన రజనీకాంత్

తన భార్యపై నిండుసభలో అవమానకరంగా మాట్లాడటంతో తీవ్ర మనోవేదనకు గురయిన చంద్రబాబు నాయుడు మీడియా సమక్షంలో బోరున విలపించారు. దీంతో తాజాగా ఆయనకు తమిళ హీరో రజనీకాంత్ ఫోన్ చేసి పరామర్శించారు. 

Tamil Superstar Rajinikanth phone call to TDP President Chandrababu Naidu
Author
Amaravati, First Published Nov 21, 2021, 12:23 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో తన భార్య భువనేశ్వరిపై అధికార వైసిపి నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ మాజీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురయి బోరున విలపించిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో జరిగిన ఘటనగురించి రాష్ట్రప్రజలకు తెలియజేస్తూ తన భార్య nara bhuvaneshwari పై చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుని chandrababu naidu కన్నీటిపర్యంతం అయ్యారు. వెక్కి వెక్కి ఏడుస్తూ తన మనసు ఎంతలా గాయపడిందో వ్యక్తపర్చారు.  

సుదీర్ఘ రాజకీయ అనుభవం, గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడి హోదాలో వున్న చంద్రబాబు కుటుంబం పట్ల వైసిపి నేతల నిండుసభలో అసభ్య పదజాలాన్ని ఉపయోగించడాన్ని TDP నాయకులే కాదు సీనీ ప్రముఖులూ ఖండిస్తున్నారు. తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును తమిళ సూపర్‌స్టార్‌ rajanikanth పరామర్శించారు. ap assembly లో జరిగిన ఘటనలను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్‌ చంద్రబాబుకు ఫోన్‌ చేసి విచారం వ్యక్తం చేశారు.

ఆదివారం ఉదయం చంద్రబాబుకు ఫోన్ చేసిన రజనీకాంత్ అసెంబ్లీ ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన విచారకరమని... రాజకీయాల కోసం వ్యక్తిగత జీవితాల గురించి అసభ్యకరంగా మాట్లాడటాన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలో మనోవేదరకు గురికావద్దని... ధైర్యంగా వుండాలంటూ చంద్రబాబును రజనీకాంత్ ఓదార్చారు. 

read more  వైసీపీపై ఎన్‌టీఆర్ కుటుంబం ఆగ్రహం.. ఎవరు ఏమన్నారంటే?

మరోవైపు అన్నాడీఎంకే పార్టీ సీనియర్‌ నేత మైత్రేయన్‌ కూడా చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. 1984 నుంచి ఎన్టీఆర్‌ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయని... ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరిపై అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేశారని విని బాధపడ్డానని AIDMK Leader ట్వీట్ చేశారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

 

గత శుక్రవారం ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలతో చంద్రబాబు నాయుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన ఆవేదనను రాష్ట్రప్రజలకు తెలియజేసేందుకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలోనే భావోద్వేగానికి లోనయిన ఆయన బోరున విలపించారు. తన భార్య భువనేశ్వరి గురించి వైసిపి నాయకులు నిండుసభలో అవమానకరంగా మాట్లాడారంటూ చంద్రబాబు వెక్కి వెక్కి కళ్లనీళ్లు పెట్టుకున్నారు.

తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదంటూ ఆవేదన వ్యక్తం చేసారు.  నేడు జరిగిన ఘటనపై ఏం చెప్పాలో కూడా అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. తనకు పదవులు అవసరం లేదని అన్నారు. క్షేత్ర స్థాయిలో తెల్చుకున్న తర్వాతే తిరిగి అసెంబ్లీకి వెళ్తానని చెప్పారు. తిరిగి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని చంద్రబాబు శపధం చేసారు. 

read more  అసెంబ్లీలో జరిగింది బయటకు రానివ్వలేదు.. రికార్డులు మాయం చేశారు.. టీడీపీ ఎమ్మెల్యేల సంచలన ఆరోపణ

నా భార్య ఆమె వ్యక్తిగత జీవితం కోసం, నా కోసం మాత్రమే పని చేసింది. ముఖ్యమంత్రి భార్యగా ఉన్న సమయంలో ఆమె ఏ రోజు కూడా రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ప్రజల కోసం ఇంటికి రాకుండా ఎంతకాలం పనిచేసినా నా భార్య ప్రోత్సహించింది. అలాంటిది ఆమె గురించి అవమానకరంగా మాట్లాడటాన్ని నేను తట్టుకోలేకపోయాను'' అంటూ చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు. 

వైసిపి నాయకుల అనుచిత వ్యాఖ్యలను విని, చంద్రబాబు కంటతడిని పెట్టడంపై టిడిపి శ్రేణులతో పలు రంగాల ప్రముఖులు స్పందిస్తున్నారు. చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారు. ఈ క్రమంలోనే రజనీకాంత్ కూడా చంద్రబాబును ఓదార్చారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios