రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధికి వ్యతిరేకంగా ఉండాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధులకు వైసీపీ మద్దతిచ్చింది.
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధికి వ్యతిరేకంగా ఉండాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధులకు వైసీపీ మద్దతిచ్చింది.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై వైసీపీ తన వైఖరిని స్పష్టం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ వంచనకు నిరసనగా ఎన్ డీఏ లేదా బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైసీపీ నిర్ణయించింది. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్య సభ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటన విడుదల చేశారు.
ఏపీకి ఇచ్చిన హమీలను కేంద్రం అమలు చేయలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయనందుకే తమ పార్టీ ఎన్డీఏ అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటు చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎన్డీఏ అభ్యర్ధులకు వైసీపీ మద్దతును ప్రకటించింది. కానీ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ మాత్రం ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉండాలని నిర్ణయం తీసుకొంది.
అయితే ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉండాలనే నిర్ణయమంటే యూపీఏకు మద్దతిస్తారా అనే విషయమై మాత్రం స్పష్టత లేదు. అయితే ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్డీఏ ప్రతిపాదించిన అభ్యర్థికి ఓటు చేస్తే రాజకీయంగా తప్పుడు సంకేతాలు వెలువడే అవకాశాలు ఉన్నందున వైసీపీ ఈ నిర్ణయం తీసుకొందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్త చదవండి:రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలు: తేల్చని జగన్, కేసీఆర్
