మాజీ మంత్రి, వైసీపీ అధినేత జగన్ కి స్వయానా బాబాయి అయిన వైఎస్ వివేకానంద రెడ్డి శుక్రవారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన మృతి పట్ల పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన చలనం లేకుండా పడి ఉండటాన్ని మొదట.. ఆయన పీఏ కృష్ణారెడ్డి చూశారు. ఆయనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. కాగా.. ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు.. పలు అనుమానాలకు తావిస్తోంది.

తలకు గాయం ఉండటం, బెడ్‌ పక్కన రక్తపు మడుగు ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వైఎస్‌ వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి తెలిపారు. ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

 ‘రాత్రి వివేకానంద రెడ్డి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఉదయం పనిమనిషితో కలిసి వెళ్లేసరికి తీవ్రగాయాలతో బాత్‌రూమ్‌లో పడి ఉన్నారు. చేతిని పట్టుకోని చూడగా.. నాడీ కొట్టుకోలేదు. వెంటనే ఆయన భార్య సౌభాగ్యమ్మ, అల్లుడికి ఫోన్‌ చేశాను. బెడ్‌రూమ్‌లో ఏసీ ఆన్‌లోనే ఉంది. బెడ్‌ పక్కన చాలా రక్తం పడి ఉంది. కానీ సార్‌ మాత్రం రక్తపుమడుగులో బాత్‌రూంలో పడి ఉన్నారు. వెనుకవైపు డోర్‌ తెరచి ఉంది. ఆ డోర్‌ ఎందుకు తీసారా? అనే అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను.’ అని కృష్ణారెడ్డి తెలిపారు.
 

related news

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం