Asianet News TeluguAsianet News Telugu

9న జగన్ పాాదయాత్ర ముగింపు: ఆ తర్వాతా ప్రజల మధ్యే..

2019 జనవరి9 ఎంతో చారిత్రాత్మక రోజు అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లండిచారు. ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర జనవరి 9తో ముగియనుందని తెలిపారు. 
 

YS Jagan Praja sankalpa yatra to end on Jan 9
Author
Hyderabad, First Published Jan 1, 2019, 5:12 PM IST

హైదరాబాద్‌: 2019 జనవరి9 ఎంతో చారిత్రాత్మక రోజు అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లండిచారు. ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర జనవరి 9తో ముగియనుందని తెలిపారు. 

2017 నవంబర్‌ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుందని తెలిపారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ 134 నియోజవకర్గాల్లో 120 బహిరంగ సభలు, రెండువేలకుపైగా గ్రామాలు, 3500 కి.మీ.పైగా పాదయాత్ర సాగిందని తెలిపారు. 

మరోవైపు పాదయాత్రకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 2 నుంచి సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించి పాదయాత్ర లక్ష్యాలను, నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రజలకు వివరించాలని పార్టీ నిర్ణయించింది.  

అలాగే మాజీ సీఎం వైఎస్ఆర్ మరణం, జగన్ ఎదుర్కొన్న కేసులు, ఆనాటి కేంద్రప్రభుత్వం వేధింపులు వంటి అంశాలను ప్రజలకు వివరించాలని పార్టీ ఆదేశించింది. పాదయాత్రలో జగన్‌ కోట్లాది మందిని నేరుగా కలిశారని వారి సమస్యలను విన్నారని తెలిపారు. 

ప్రజా సమస్యలు వింటూ, వారి సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తూ పాదయాత్ర సాగించారన్నారు. అన్ని వర్గాల ప్రజలును కలుస్తూ పాదయాత్ర దిగ్విజయంగా ముందుకు వెళ్లిందన్నారు. ఏపీ ప్రజలకు కొత్త ఆశాకిరణం వైఎస్‌ జగన్‌ అని చెప్పుకొచ్చారు. పాదయాత్రలో ప్రజల సాధక బాధలను తెలుసుకున్నారని తెలిపారు. 

ఇకపోతే పాదయాత్రలో కవర్ చెయ్యని నియోజకవర్గాల్లో ఎలా పర్యటించాలా అనే అంశంపై పార్టీలో చర్చ జరుగుతుందన్నారు. బస్సు పర్యటనకు శ్రీకారం చుట్టాలా లేక బహిరంగసభలు పెట్టాలా అనే అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. 

పాదయాత్ర అనంతరం వైఎస్ జగన్ నిత్యం ప్రజల మధ్యే ఉంటారని తెలిపారు. నాలుగున్నరేళ్ల పాలనలో ఏమీ చేయ్యని చంద్రబాబు ఎన్నికలకు ముందు హడావిడి చేస్తున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబు తీరు చూస్తే మిగిలినవారందరూ దొంగలు నేనే మంచివాడ్నని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. 

కేసిఆర్ ను నేనే కలవాలనుకున్నానని చెప్పిన చంద్రబాబు ఇతరులు కేసిఆర్ ను కలిస్తే కుట్ర అంటున్నారని అన్నారు. మా ప్రథమ ప్రత్యర్ది చంద్రబాబునాయుడు అంటూ చెప్పుకొచ్చారు. 

పరిపాలన పరంగా విభజన జరిగిందే తప్ప ప్రజల మధ్య విభజన లేదు కాబట్టి కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తామంటే సంతోషిస్తామన్నారు. చంద్రబాబు నిజస్వరుపాన్నిఎవరు బయటపెట్టినా సంతోషిస్తామ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

వేగం పెంచిన జగన్: పాదయాత్ర ముగింపు సభలో అభ్యర్థుల ప్రకటన

ఇచ్చాపురంలో పాదయాత్ర ముగింపు సభ: పైలాన్ ఆవిష్కరించనున్న వైఎస్ జగన్

వేగం పెంచిన జగన్: పాదయాత్ర ముగింపు సభలో అభ్యర్థుల ప్రకటన

వైసీపీ గూటికి హీరో నాగార్జున: జగన్ బస్సుయాత్రలో ప్రత్యక్షం కానున్న కింగ్

 

Follow Us:
Download App:
  • android
  • ios