శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ జగన్ తన పాదయాత్రను ముగించాలని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో జనవరి 9న లేదా 10న పాదయాత్రను ముగించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో ఇచ్చాపురంలో భారీ ముగింపు బహిరంగ సభను నిర్వహించాలని జగన్ భావిస్తున్నారు. ఆ సభలోనే అభ్యర్థులను ప్రకటించాలని కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇచ్చాపురం ముగింపు సభ వేదికగా ఎన్నికల సమరానికి శంఖారావం పూరించే అవకాశం ఉంది. 

ఇకపోతే ఇచ్చాపురం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్రకు సంబంధించి భారీ పైలాన్ ఆవిష్కరించనున్నారు వైఎస్ జగన్. దీంతో పైలాన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగం సోమవారం వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం పైలాన్ ఏర్పాట్లను పరిశీలించారు.  పైలాన్ ఆవిష్కరణకు వారం రోజుల మాత్రమే ఉండటంతో పనులు వేగవంతం చెయ్యాలని ఆదేశించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

వేగం పెంచిన జగన్: పాదయాత్ర ముగింపు సభలో అభ్యర్థుల ప్రకటన

వైసీపీ గూటికి హీరో నాగార్జున: జగన్ బస్సుయాత్రలో ప్రత్యక్షం కానున్న కింగ్