Asianet News TeluguAsianet News Telugu

నిరసన సక్సెస్, వైసీపీ నేతలు పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్టులా: కళా వెంకట్రావు

చంద్రబాబు నాయుడు చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమం విజయవంతమైందని స్పష్టం చేశారు. గ్రామాల్లో నెలకొన్న పరిస్థితిని రాష్ట్రం దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నించారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు పిలుపుతో ఏపీ కాదు దేశమంతా ఏపీ గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకున్నారని తెలిపారు. 

YCP leaders are like Political Paid Artists says ap tdp president kala venkatarao
Author
Guntur, First Published Sep 11, 2019, 5:43 PM IST

అమరావతి: వైసీపీ బాధితులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వైసీపీ నేతలు విమర్శించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్టులా అంటూ నిలదీశారు. వైయస్ జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందన్నారు. 

చట్టాన్ని, పోలీసు వ్యవస్థని వైసీపీ ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. బాధితులు కేసులు పెట్టినా పోలీసులు పట్టించుకోకుండా దాడి చేసిన వారి పెట్టిన కేసులు నమోదు చేయడం బాధాకరమన్నారు. 

చంద్రబాబు నాయుడు చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమం విజయవంతమైందని స్పష్టం చేశారు. గ్రామాల్లో నెలకొన్న పరిస్థితిని రాష్ట్రం దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నించారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు పిలుపుతో ఏపీ కాదు దేశమంతా ఏపీ గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకున్నారని తెలిపారు. 

5224 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు చలో ఆత్మకూరు కార్యక్రమం, నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు 70 మంది టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయగా 1144 మందిని అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. 

తాము చేసిన పోరాట ఫలితంగానే వైసీపీ బాధితులను తమ స్వగ్రామాలకు తరలించారంటూ కళా వెంకట్రావు స్పష్టం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేయడం సరికాదన్నారు. గేటుకు తాళ్లు కట్టడం ఎక్కడికక్కడ అడ్డుకుని భయభ్రాంతులకు గురి చేయాలనుకోవడం సరికాదని హితవు పలికారు.  

తెలుగుదేశం పార్టీ చేసే ఉద్యమాలను అణిచి వేయాలని చూస్తే మరింత ముందుకు వెళ్తామన్నారు. ప్రభుత్వం ముందే స్పందించి ఉంటే ఇంతటి ప్రతిఘటన ఉండేదికాదన్నారు. రాబోయే బుధవారం పిన్నెల్లి, ఆత్మకూరు గ్రామాల్లో దళిత, బీసీ, మైనారిటీ వైసీపీ బాధితులను కలుస్తారని స్పష్టం చేశారు. 

గ్రామాల్లో వారికి రక్షణ కల్పించడంతోపాటు వారికి వ్యవసాయ పనులకు సహకరిస్తున్నారా లేదా అన్న దానిపై స్వయంగా చంద్రబాబు తెలుసుకుంటారని తెలిపారు కళా వెంకట్రావు. గురువారం డీజీపీ గౌతం సవాంగ్ ను కలవనున్నట్లు తెలిపారు. 

ఆత్మకూరు, పిన్నెల్లి గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలపై మూడు పుస్తకాలు ముద్రించామని వాటిని లేఖ పూర్వకంగా డీజీపీకి అందజేయనున్నట్లు తెలిపారు. 

రాష్ట్రంలో జరిగిన 567 ఘటనలకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు 13 జిల్లాలకు 13 బృందాలను పంపాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిందని  టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు స్పష్టం చేశారు.  

ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీ రౌడీయిజానికి సాక్ష్యం ఇది.. ట్విట్టర్ లో లోకేష్

ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు: హౌస్ అరెస్ట్‌పై బాబు

1989లో ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబు: ఆత్మకూరులో ఆసలేం జరిగింది?

భూమా అఖిలప్రియ హౌస్ అరెస్టు: పోలీసులతో వాగ్వివాదం

చలో ఆత్మకూరు ఎఫెక్ట్: చంద్రబాబునాయుడు హౌజ్ అరెస్ట్, నిరహార దీక్ష

గుంటూరులో టెన్షన్: టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్

తాడోపేడో తేల్చుకుంటాం, వదిలిపెట్టను: జగన్ సర్కార్ పై చంద్రబాబు గరంగరం

వేడెక్కిన పల్నాడు: టీడీపీకి పోటీగా.. రేపు వైసీపీ చలో ఆత్మకూరు

Follow Us:
Download App:
  • android
  • ios