వైసీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారని... అందుకు ఇదే సాక్ష్యం అంటూ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ  నారా లోకేష్ పేర్కొన్నారు. టీడీపీ నేతలను, కార్యకర్తలను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారనడానికి ఇదే సాక్ష్యం అంటూ ఓ వీడియోని పోస్టు చేశారు. టీడీపీ శ్రేణులను బహిరంగంగా హెచ్చరిస్తున్నారంటూ వైసీపీ నేతకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. ఇతనిపై చర్య తీసుకునే దమ్ముందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

‘‘పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ రౌడీయిజం చేస్తుందనడానికి ఈ వైసీపీ గూండా మాటల కన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? పబ్లిగ్గా తెదేపా వాళ్ళను హెచ్చరిస్తున్న ఇతని మీద చర్య తీసుకునే దమ్ము పోలీసులకు, హోమ్ మంత్రికి ఉందా? గ్రామగ్రామాన, వీధి వీధినా ఇలాంటి హెచ్చరికలే వినిపిస్తున్నాయి. అందుకే మా పోరాటం. తెదేపా ఇలాంటి బెదిరింపులకు వెనక్కి తగ్గదు. పోలీసులు అక్రమ కేసులు, నిర్బంధాలు చేసినా సరే. మా అడుగు ముందుకే. ప్రజాసంఘాలు, మానవహక్కుల నేతలు ఈ దారుణాలను ప్రశ్నించాలి? ప్రజాపక్ష పార్టీలన్నీ తెదేపా పోరాటానికి మద్దతిచ్చి అప్రజాస్వామిక చర్యలను అడ్డుకోవాలి’’ అంటూ ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో ‘‘అందుకే మా పోరాటం. తెదేపా ఇలాంటి బెదిరింపులకు వెనక్కి తగ్గదు. పోలీసులు అక్రమ కేసులు, నిర్బంధాలు చేసినా సరే. మా అడుగు ముందుకే. ప్రజాసంఘాలు, మానవహక్కుల నేతలు ఈ దారుణాలను ప్రశ్నించాలి? ప్రజాపక్ష పార్టీలన్నీ తెదేపా పోరాటానికి మద్దతిచ్చి అప్రజాస్వామిక చర్యలను అడ్డుకోవాలి.’’ అని పేర్కొన్నారు.