అమరావతి: చలో ఆత్మకూరును అడ్డుకోవడమే కాకుండా ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేయడాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

బుధవారం నాడు చంద్రబాబునాయుడు చలో ఆత్మకూరుకు వెళ్లకుండా పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.బాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్‌ను కూడ పోలీసులు అడ్డుకొన్నారు. కార్యకర్తలతో కలిసి ఇంటి నుండి ర్యాలీగా  పార్టీ కార్యాలయానికి వెళ్లున్న లోకేష్ ను పోలీసులు అడ్డుకొని హౌజ్ అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు పార్టీ నేతలు, కార్యకర్తలతో బుధవారం నాడు టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ప్రశ్నించే గొంతును నొక్కడం ప్రజాస్వామ్యమా అని ఆయన నిలదీశారు. పునరావాస శిబిరానికి  ఆహారం, నీటి సరఫరాను అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.  

ఇది అమానుషమని ఆయన అన్నారు. పునరావాస శిబిరంలో ఉన్న  వారికి ఆహారం అందించేందుకు వెళ్లిన తమ వారిని అడ్డుకోవడంపై చంద్రబాబు మండిపడ్డారు.ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నిరంకుశ పాలనలో ఉన్నామా అని ఆయన ప్రశ్నించారు.

వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ కూడ ఖండించాలని  ఆయన కోరారు.న్యాయం చేయాలని కోరితే తమపై కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

"


సంబంధిత వార్తలు

1989లో ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబు: ఆత్మకూరులో ఆసలేం జరిగింది?

భూమా అఖిలప్రియ హౌస్ అరెస్టు: పోలీసులతో వాగ్వివాదం

చలో ఆత్మకూరు ఎఫెక్ట్: చంద్రబాబునాయుడు హౌజ్ అరెస్ట్, నిరహార దీక్ష

గుంటూరులో టెన్షన్: టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్

తాడోపేడో తేల్చుకుంటాం, వదిలిపెట్టను: జగన్ సర్కార్ పై చంద్రబాబు గరంగరం

వేడెక్కిన పల్నాడు: టీడీపీకి పోటీగా.. రేపు వైసీపీ చలో ఆత్మకూరు