చలో ఆత్మకూరు ఎఫెక్ట్: చంద్రబాబునాయుడు హౌస్ అరెస్ట్, నిరహార దీక్ష
చలో ఆత్మకూరుకు వెళ్లకుండా టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడును పోలీసులు అడ్డుకొన్నారు. బుధవారం నాడు 12 గంటల పాటు చంద్రబాబునాయుడు నిరహరదీక్షకు దిగుతానని ప్రకటించారు.
చలో ఆత్మకూరుకు వెళ్లకుండా ఉండవల్లిలోని తన నివాసంలోనే మాజీ సీఎం చంద్రబాబునాయుడును బుధవారం నాడు ఉదయం పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా ఇవాళ రాత్రి 8 గంటల వరకు నిరహరదీక్ష చేస్తానని చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని బాబు పిలుపునిచ్చారు.
చంద్రబాబునాయుడు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. నివాసం నుండి బయటకు వచ్చిన లోకేష్ ను పోలీసులు ఇంట్లోకి వంపించివేశారు.ఆయనను కూడ హౌజ్ అరెస్ట్ చేశారు. చంద్రబాబును కూడ హౌజ్ అరెస్ట్ చేశారు. బయటకు వస్తే మళ్లీ లోపలికి పంపించేలా పోలీసులు చర్యలు తీసుకొన్నారు. ఇంట్లో నుండి బాబు బయటకు రాకుండా అడ్డుపడ్డారు. హౌజ్ అరెస్టుపై చంద్రబాబునాయుడు మండిపడ్డారు.
హౌజ్ అరెస్ట్ ను నిరసిస్తూ 12 గంటల పాటు నిరహారదీక్షకు దిగుతానని చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఇవాళ రాత్రి 12 గంటల పాటు నిరహరదీక్షను కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు. వైఎస్ఆర్‌సీపీ బాధితులకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగాలని చంద్రబాబునాయుడు పార్టీ కార్యకర్తలకు సూచించారు. బుధవారం నాడు ఉదయం చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు.
టీడీపీ కార్యకర్తలపై వైఎస్ఆర్‌సీపీ దాడులను నిరసిస్తూ బుధవారం నాడు చలో ఆత్మకూరుకు టీడీపీ పిలుపునిచ్చింది. టీడీపీ బాధితులతో వైఎస్ఆర్ సీపీ కూడ పోటీగా చలో ఆత్మకూరుకు బుధవారం నాడు చేపడతామని ప్రకటించింది. రెండు పార్టీల పోటాపోటీల కార్యక్రమాలతో పోలీసులు టీడీపీ నేతలు, కార్యకర్తలను హౌజ్ అరెస్ట్ చేశారు.
సంబంధిత వార్తలు
గుంటూరులో టెన్షన్: టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్
తాడోపేడో తేల్చుకుంటాం, వదిలిపెట్టను: జగన్ సర్కార్ పై చంద్రబాబు గరంగరం
వేడెక్కిన పల్నాడు: టీడీపీకి పోటీగా.. రేపు వైసీపీ చలో ఆత్మకూరు