ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకి హీటెక్కుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేయాలని అనుకుంటోంది. మరోవైపు శాసన మండలిలో వైసీపీ నేతలు దారుణంగా ప్రవర్తించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రీసెంట్ గా లోకేష్ విడుదల చేసిన వీడియో సైతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత యనమల యనమల రామకృష్ణుడు ఇటీవల వైపీసీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

యనమల మాట్లాడుతూ.. ''ఒక్క చాన్స్ అంటూ వచ్చిన జగన్ భస్మాసుర అస్త్రం రాష్ట్రం పై పెట్టాడు. మండలి రద్దు పై తీర్మానం మాత్రమే రాష్ట్రం చేస్తుంది. మండలి రద్దుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారమే లేదు. కేంద్రం రాష్ట్ర తీర్మానాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వానికి అంత పట్టుదల గా ఉంటే శాసన సభ కూడా రద్దు చెయ్యండి.  చైర్మన్ కు అధికారం లేదని కొత్త పల్లవి మొదలు పెట్టారు. తుది నిర్ణయం కాకుండా ఏ శాఖ కదల్చ కూడదని హో కోర్ట్చెప్పింది. చైర్మన్ బిల్స్ సెలక్ట్ కమిటీ కి పంపలేదని అసత్య ప్రచారం చేస్తున్నారు. మంత్రుల కు బుర్ర ఉందా లేదా' అని అనిపిస్తోందని యనమల మాట్లాడారు.

Also Read:ప్రాసెస్ పూర్తి కాలేదు, ట్విస్టిచ్చిన షరీఫ్: టీడీపీ, వైసీపీ వాదనలు ఇవీ

శుక్రవారం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ బృందం గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసింది. అనంతరం ఇందుకు సంబంధించిన వివరాలను యనమల మీడియాకు వెల్లడించారు.

పోలీసులు సైతం ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ తానే శాశ్వతంగా అధికారంలో ఉంటారనే అపోహలో ఉన్నారని, అయితే ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడిన వారు పవర్‌లో ఉండరని.. ఆయన అడిగింది కూడా ఒక్క ఛాన్సే అని ఆయన సెటైర్లు వేశారు.

పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ సందర్భంగా జరిగిన పరిణామాలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా తాము గవర్నర్‌ను కోరామని యనమల తెలిపారు.

Also Read:సోమవారం ఉదయమే ఏపి కేబినెట్ భేటీ... మండలి భవితవ్యంపై కీలక నిర్ణయం

ఆర్టికల్ 169 ప్రకారం మండలిని రద్దు చేసేందుకు ప్రభుత్వానికి తీర్మానం చేసే అధికారం మాత్రమే ఉందని రామకృష్ణుడు స్పష్టం చేశారు. రద్దు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని.. అయితే ఇందుకు చాలా సమయం పడుతుందని యనమల తెలిపారు. సెలక్ట్ కమిటీ అంటే జగన్ ప్రభుత్వానికి భయం ఎందుకని యనమల ప్రశ్నించారు.