జనసేనలోకి ముద్రగడ?: కిర్లంపూడిలో పద్మనాభంతో భేటీకి పవన్
జనసేనలోకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేరే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభంతో భేటీ కానున్నారు.
కాకినాడ: కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరడానికి సానుకూలంగా ఉన్నారని సమాచారం.ఈ నెల 20 లేదా 23వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కిర్లంపూడికి వచ్చే అవకాశం ఉంది. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభంతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. జనసేనలో చేరాలని ముద్రగడ పద్మనాభాన్ని పవన్ కళ్యాణ్ ఆహ్వానించనున్నారు.
ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ కావాలని భావిస్తున్నారు.ఈ నెల 1వ తేదీన తన అనుచరులు, కాపు సామాజిక వర్గం నేతలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ముద్రగడ పద్మనాభం. తొలుత వైఎస్ఆర్‌సీపీలో ముద్రగడ పద్మనాభం చేరుతారనే ప్రచారం సాగింది. అయితే వైఎస్ఆర్‌సీపీలో చేరేందుకు ముద్రగడ పద్మనాభం ఆసక్తిని చూపలేదు. నాలుగు రోజుల క్రితం జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు.
also read:వైఎస్ఆర్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు: బాబుతో భేటీ తర్వాత షర్మిల
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంపిన లేఖను ముద్రగడ పద్మనాభానికి అందించారు. అదే రోజున తెలుగు దేశం నేత, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు కూడ ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. అయితే అదే రోజున వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడ ముద్రగడ పద్మనాభంతో భేటీ అవుతారని ప్రచారం సాగింది. కానీ ఈ భేటీ జరగలేదు.
also read:సీఎం అభ్యర్ధిగా చిరంజీవి: కాంగ్రెస్ నేత చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ నెల 13న ముద్రగడ పద్మనాభంతో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ భేటీ అయ్యారు.జనసేనలో చేరేందుకు ముద్రగడ పద్మనాభం సానుకూలంగా ఉన్నారని బొలిశెట్టి శ్రీనివాస్ మీడియాకు చెప్పారు. ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి ఆహ్వానించేందుకు పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వస్తారని బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పారు.
also read:నామినేటేడ్ పదవుల భర్తీకి రేవంత్ కసరత్తు:కోదండరామ్‌కు ఎమ్మెల్సీ?