ఏపీ రాజకీయాల్లో సంచలనం: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు ఏమిటీ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో  స్కిల్ డెవలప్ మెంట్ కేసు చర్చకు కారణమైంది. చంద్రబాబు అరెస్ట్ తో స్కిల్ కేసు తెరమీదికి వచ్చింది.

What is Andhra Pradesh Skill Development Case lns

అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును గత ఏడాది  అరెస్ట్ చేయడంతో స్కిల్ కేసు తెర మీదికి వచ్చింది.  స్కిల్ కేసు విషయమై  చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారంనాడు సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది.  

2014లో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014-2019  మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా  పనిచేశారు.చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో  యువతకు  శిక్షణ ఇచ్చేందుకు  స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ ను ప్రారంభించారు..  ఈ మేరకు  సీమెన్స్ అనే సంస్థతో రూ. 3,350 కోట్లతో ఒప్పందం కుదిరింది.  ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం  10 శాతం వాటా చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన  రూ. 240 కోట్లు దారి మళ్లించారని సీఐడీ అభియోగాలు మోపింది. 

అంతే కాదు ఈ విషయమై ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీ సర్కార్ ఆరోపణలు ఆరోపించింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  2021  జూలై మాసంలో ఈ విషయమై విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ విషయమై  స్కిల్ డెవలప్ మెంట్  కార్పోరేషన్ చైర్మెన్ గా  అజయ్ రెడ్డి  సీఐడీకి ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా  సీఐడీ  అధికారులు  కేసు నమోదు చేసుకొని విచారణ చేశారు.   చంద్రబాబు సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో  స్కిల్ డెవలప్ మెంట్  మాజీ ఎండీ , సీఈఓ గంటా సుబ్బారావు, డైరెక్టర్ కె. లక్ష్మీనారాయణతో పాటు  26 మందిపై కేసులు నమోదయ్యాయి.    2015 జూన్ మాసంలో స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అవకతవకలు జరిగినట్టుగా సీఐడీ ఆరోపించింది. టీడీపీ సర్కార్ విడుదల చేసిన  రూ. 241 కోట్లు ఏడు దారి మళ్లాయని  సీఐడీ ఆరోపించింది.

also read:భారత్‌లో ఏటా రూ. 70 లక్షల సంపాదన: ఏడు వృత్తులు ఇవే....

తప్పుడు ఇన్‌వాయిస్ లు సృష్టించారని కూడ  సీఐడీ పేర్కొంది.  2017-18 లో  రూ. 241 కోట్ల గోల్ మాల్ జరిగాయని  సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.  మరో వైపు జీఎస్టీని కూడ ఎగవేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి.సీఐడీ కేసు ఆధారంగా ఈడీ అధికారులు కూడ ఈ కేసును విచారించారు.  ఈ కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. 

also read:విచారణకు హాజరు కాలేను: ఢీల్లీ లిక్కర్ స్కాంలో ఈడీకి కవిత లేఖ

ఇదిలా ఉంటే  ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు చంద్రబాబుకు సంబంధం ఉందని ఆరోపిస్తూ  ఏపీ సీఐడీ  అధికారులు  2023 సెప్టెంబర్  9వ తేదీన అరెస్ట్ చేశారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కేసులో  తనను అరెస్ట్ చేశారని చంద్రబాబు అప్పట్లో  ప్రకటించారు. రాజకీయంగా వేధింపులకు గురిచేసేందుకు స్కిల్ కేసులో తన పేరును చేర్చారని  చంద్రబాబు అప్పట్లో పేర్కొన్న విషయం తెలిసిందే.తనతో పాటు తమ పార్టీకి చెందిన కీలక నేతలపై తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తుందని చంద్రబాబు అప్పట్లోనే  ఆరోపణలు చేశారు.ఈ క్రమంలోనే తనపై  కూడ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని  ఆరోపించారు. స్కిల్ కేసులో అరెస్ట్ కావడానికి  మూడు రోజుల ముందే తనను కూడ అరెస్ట్ చేస్తారని చంద్రబాబు  సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

also read:స్కిల్ డెవలప్ మెంట్ కేసులోబాబు పిటిషన్ : సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

ఈ విషయమై చంద్రబాబుకు గత ఏడాదిలోనే ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.  అయితే స్కిల్ కేసులో  ఏపీ సీఐడీ దాఖలు చేసిన  ఎఫ్ఐఆర్ ను కొట్టివేయడంతో పాటు రిమాండ్ ను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేశారు. చంద్రబాబుకు  17 ఏ సెక్షన్ వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. చంద్రబాబుకు 17 ఏ సెక్షన్ వర్తించదని  ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.  ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పును వెల్లడించనుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios