మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. ఇద్దరు యువకులను బంధించిన కుటుంబీకులు

కృష్ణా జిల్లా నందిగామ మండలంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మహిళా ఏఆర్ కానిస్టేబ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవరం గ్రామంలో ఆందోళనలకు దారి తీశాయి. తమ కూతురిది ఆత్మహత్య కాదని, రుద్రవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు హత్య చేశారని మరణించిన యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అక్కడికి వచ్చిన ఇద్దరు యువకులను ఇంటిలో నిర్బంధించారు.
 

woman AR constable suicides in andhra pradesh

అమరావతి: Krishna జిల్లాలో కలకలం రేగింది. AR Constableగా విధులు నిర్వహిస్తున్న జిల్లేపల్లి ప్రశాంతి ఉరి వేసుకుని Suicide చేసుకుంది. కానీ, తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిది ఆత్మహత్య కాదు.. హత్యే అని వాదిస్తున్నారు. రుద్రవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులే తమ కూతురిని హత్య చేశారని ఆరోపించారు. ఆ తల్లిదండ్రులను సదరు యువకులు పరామర్శించడానికి రావడంతో నందిగామ మండలం సోమవరం గ్రామంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి..

జిల్లేపల్లి ప్రశాంతి ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కానీ, తల్లిదండ్రులు మాత్రం రుద్రవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులే తమ కూతురిని హతమార్చారని ఆరోపించారు. అయితే, తల్లిదండ్రులు పేర్కొన్న ఇద్దరు యువకులు జిల్లేపల్లి ప్రశాంతి తల్లిదండ్రులను పరామర్శించడానికి సోమవరం గ్రామానికి వచ్చారు. కానీ, తల్లిదండ్రులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరే తమ కూతురిని చంపేశారని మండిపడ్డారు. వారిని గృహ నిర్బంధం చేశారు. పక్కా ప్రణాళికతోనే వారు
పరామర్శించడానికి వచ్చారని అన్నారు. 

Also Read: కరీంనగర్: మృత్యువును జయించిన ఆ నలుగురు... ఒకేసారి యాక్సిడెంట్, అగ్నిప్రమాదం చుట్టుముట్టినా

పోలీసులకు ఈ విషయం తెలిసింది. వెంటనే వారు స్పాట్‌కు చేరుకున్నారు. అయితే, ప్రశాంతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చిన పోలీసులతోనూ వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. ఎట్టకేలకు పోలీసుల రంగం ప్రవేశంతో ఉద్రిక్తతలు తొలగిపోయాయి.

కాగా, ఆ ఇద్దరు యువకులలో ఒకరు మాట్లాడుతూ, మరణించిన ప్రశాంతి వారికి వరుసకు మరదలు అవుతుందని పేర్కొన్నారు. తమ తమ్ముడు, ఆ యువతి ప్రేమించుకున్నారని వెల్లడించారు. ప్రశాంతి చనిపోవడానికి ముందు రోజు కూడా వారిద్దరు ఫోన్ మాట్లాడుకున్నారని తెలిపారు. ఆమె మరణానికి తమకు సంబంధం లేదని వివరించారు. బహుశా రూమ్‌మేట్‌తో గొడవ కారణంగానే ప్రశాంతి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అన్నారు. అంతేకాదు, ఇది వరకు జరిగిన ఘటనలో తమది ఏ తప్పు ఉన్నా శిక్షకు సిద్ధమని వివరించారు. 

Also Read: ఘర్షణ, కాల్పులు.. తండ్రి, కొడుకులు మృతి..!

తమకు న్యాయం జరగాలని ప్రశాంతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని వివరించారు. కానీ, ఇలా అర్ధంతరంగా వెళ్లిపోతుందని అనుకోలేదని వాపోయారు. ప్రశాంతి సోదరి మాట్లాడుతూ, తన చెల్లి మరణించినట్టు ఓ ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. తాము వెంటనే చెప్పిన స్థలానికి వెళ్లామని వివరించారు. కానీ, అక్కడికి వెళ్తే తమ చెల్లి లేదని చెప్పారు. అప్పటికే ఆమెను హాస్పిటల్‌కు పంపారని తెలిసిందని అన్నారు. తమ చెల్లిని ఆ ఇద్దరు యువకులే చంపారనే అనుమానం ఉన్నదని తెలిపారు. తమకు న్యాయం జరగాలని అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios