కరీంనగర్: మృత్యువును జయించిన ఆ నలుగురు... ఒకేసారి యాక్సిడెంట్, అగ్నిప్రమాదం చుట్టుముట్టినా

కారు రోడ్డు ప్రమాదానికి గురయి ఆ వెంటనే అగ్నిప్రమాదానికి గురయినా అందులో ప్రయాణిస్తున్న నలుగరు  సురక్షితంగా బయటపడ్డారు. ఇలా ఒకేసారి రెండు ప్రమాదాలనుండి బయటపడి మృత్యువును జయించారు. 

 

 

Narrow escape for four as car catches fire on Rajiv highway near karimnagar

కరీంనగర్‌: వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కనన్న చెట్టుకు ఢీకొట్టింది. వెంటనే ఇంజన్లో మంటలు చెలరేగి కారు మొత్తం దగ్దమయ్యింది. అయితే ఇలా ఒకేసారి కారు రోడ్డు ప్రమాదం, అగ్నిప్రమాదానికి గురయినా అందులో ప్రయాణిస్తున్న నలుగురు తృటితో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... karimnagar సమీపంలో ఆదివారం అర్దరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.రాజీవ్ రహదారి (rajeev highway)పై వేగంగా వెళుతున్న ఓ కారు వేగంగావెళుతూ అదుపుతప్పింది. దీంతో కారు రోడ్డుపైనుండి కిందకు దూసుకెళ్లి ఓ చెట్టును ఢీకొట్టి ఆగింది. ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డామని కారులోని వారు అనుకుంటుండగానే మరో ప్రమాదం వారిని చుట్టుముట్టింది. 

మితిమీరిన వేగంతో కారు చెట్టును ఢీకొనడంతో ఇంజన్లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు క్షణాల్లో కారు మొత్తాన్ని వ్యాపించాయి. దీంతో చూస్తుండగానే కారు దగ్దమయ్యింది. రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన వారు వెంటనే కారులోంచి దిగడంతో అగ్నిప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఇలా రెండు ప్రమాదాల నుండి నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.  

read more  కొడైకెనాల్: లోయలో పడ్డ కారు... మూడునెలల చిన్నారి సహా తల్లికూతుళ్ల దుర్మరణం

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే కరీంనగర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న కారు పూర్తిగా దగ్దమయ్యింది.  

ఇదిలావుంటే ఇటీవల హైదరాబాద్ శివారులో ఔటర్ రింగ్ రోడ్డుపై కూడా ఇలాగే ఓ కారు ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకోగా ఓ డాక్టర్ సజీవ దహనమయ్యాడు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం కేంద్రంలోని శివాజీ నగర్ కి చెందిన డాక్టర్ నేలపాటి సుధీర్(39) కొన్ని సంవత్సరాలుగా కేపీహెచ్ బీ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ లోని కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉండేవాడు. ఆయనకు భార్య సుప్రజ, తొమ్మిది సంవత్సరాల కుమారుడు ఉన్నారు. 

read more  మెదక్ జిల్లాలో దగ్దమైన కారు: డిక్కీలో డెడ్‌బాడీ

సుధీర్ హైదరాబాద్ నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో  ఆర్థోపెడిక్ వైద్యుడిగా సేవలందించారు. అయితే కొంతకాలం నుంచి ఆయన వైద్య వృత్తిని వదిలి మైనింగ్ వ్యాపారం మొదలుపెట్టారు. ఈ  క్రమంలోనే బిజినెస్ పనుల్లో భాగంగా ఆయన ఒంటరిగా బయటకు వెళ్లాడు. ఔటర్ రింగ్ రోడ్డుపై వెళుతుండగా నానక్ రామ్ గూడ కూడలి వద్ద ఆయన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆయన సజీవ దహనమయ్యారు.

ఇలా వాహనాల్లో మంటలు చెలరేగడానికి అనేక కారణాలున్నాయి. ప్రమాదాలు జరిగిన సమయంలో తరచూ ఇలా మంటలు చెలరేగుతూ  వుంటాయి. ఇక వేసవికాలంలో అయితే మండుటెండలకు వాహానాల్లోకి ఇంజన్ వేడెక్కి మంటలు చెలరేగుతుంటాయి. అలాగే సాంకేతిక కారణాలతో కూడా అప్పడప్పుడు మంటలు చెలరేగుతున్నారు. ఇలా వాహనాల్లో మంటలు చెలరేగి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. 

తాజాగా కరీంనగర్ లో రోడ్డు ప్రమాదం జరిగి ఆ వెంటనే అగ్నిప్రమాదం చోటుచేసుకున్నా ఈ రెండు ప్రమాదాల నుండి నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రయాణిస్తున్నవారు సజీవదహనం అవుతున్న ఘటనలు వున్నాయి. 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios