Asianet News TeluguAsianet News Telugu

ఘర్షణ, కాల్పులు.. తండ్రి, కొడుకులు మృతి..!

భరత్ పూర్ జిల్లాకు చెందిన సురేంద్ర సింగ్, లఖర్ శర్మల మధ్య శనివారం రాత్రి మాటల యుద్దం జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం.. ఘర్షణకు దారి తీసింది.

Father Son Shot Dead In Rajasthan's Bharatpur: Police
Author
Hyderabad, First Published Nov 8, 2021, 12:39 PM IST

తుపాకీతో కాల్చి.. ఇద్దరు తండ్రి, కొడుకులను దారుణంగా కాల్చి చంపేశారు. ఈ సంఘటన రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఘర్షణలో భాగంగా జరిగిన కాల్పుల్లో.. 46ఏళ్ల తండ్రి.. అతని టీనేజ్ కుమారుడు చనిపోయారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు.

కాగా.. వారిపై కాల్పులు జరిపిన నిందితులకు కూడా.. గాయాలు అయ్యాయని.. వారు చికిత్స నిమిత్తం ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసులను పోలీసులు సస్పెండ్ చేశారు.

Also Read: తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. చెన్నై సహా నాలుగు జిల్లాల్లో పాఠశాలలు బంద్..

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. భరత్ పూర్ జిల్లాకు చెందిన సురేంద్ర సింగ్, లఖర్ శర్మల మధ్య శనివారం రాత్రి మాటల యుద్దం జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం.. ఘర్షణకు దారి తీసింది.

నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న కొత్వాలి పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ విజయ్ పాల్, హెడ్ కానిస్టేబుల్ మాన్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని శాంతింపజేశారు.

Also Read: Padma Awards: రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం.. అవార్డులు అందుకున్న పీవీ సింధు, కంగనా..

అయితే, ఆదివారం ఉదయం సుభాష్ నగర్‌లోని సురేంద్ర సింగ్ నివాసంలో ఇరువర్గాల సభ్యులు సమావేశమై సమస్యను పరిష్కరించారు. ఈ సమావేశంలో లఖన్ శర్మ సోదరుడు దిలావర్ సురేంద్ర సింగ్, అతని కుమారుడు సచిన్ (17)పై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.

దిలావర్ అప్పుడు కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు కాల్ చేసి, సురేంద్ర సింగ్ మొదట తనపై కాల్పులు జరిపాడని ఆరోపించాడు. ఈ ఘటనలో ద దివాలర్ సురేంద్ర సింగ్, లఖన్ శర్మ, సచిన్ లు తీవ్రంగా గాయపడగా.. వారిలో సురేంద్ర, సచిన్ లు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. లఖన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బాధితుల కుటుబసభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిద్దరి మధ్య ఘర్షణ జరిగిందని తెలిసినా.. నిర్లక్ష్యం చూపించిన కారణం చేత..  ఉన్నతాధికారులు.. ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్  లను సస్పెండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios