- Home
- Telangana
- IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
IMD Cold Wave Alert : తెలంగాణలో ఈ శీతాకాలం ఆల్ టైమ్ రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాాశాలున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాలపై చలి పంజా
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. సాధారణంగా డిసెంబర్ ఎండింగ్, జనవరి ఆరంభంలో చలి తారాస్థాయికి చేరుకుంది. కానీ ఈఏడాది శీతాకాలం ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... రాబోయేరోజుల్లో మరింత తగ్గి చలి పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ఆల్ టై రికార్డులు బద్దలుగొట్టేలా చలి ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈసారి గడ్డకట్టే చలి
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు 28 డిసెంబర్ 2014 లో నమోదయ్యాయి. ఆనాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ లో నమోదైన 1.8°C ఇప్పటివరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు. ఆ తర్వాత 10 జనవరి 2015 లో 2°C అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇలా 2014-15 సంవత్సరంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలున్నాయి. 10-15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలున్నాయని.. ఆల్ రికార్డు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వంటివారు అంచనా వేస్తున్నారు. 2025-26 సంవత్సరం శీతాకాలం చాలాకాలం గుర్తుండిపోతుందని... ఈసారి వీచే చలిగాలుల గురించి భవిష్యత్ లో మాట్లాడుకుంటామని అంటున్నారు.
ఈసారి ఆల టైమ్ రికార్డు టెంపరేచర్స్?
వాతావరణ నిపుణుల అంచనాలను బట్టి ఈసారి 1 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దట్టమైన పొగమంచు కురుస్తోంది... రాబోయే రోజుల్లో కొన్నికొన్ని ప్రాంతాల్లో కాశ్మీర్ మాదిరిగా మంచు కురిసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఆ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ చలిగాలులతో చిన్నపిల్లలు, ముసలివారు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఇబ్బందిపడే అవకాశాలుంటాయి... వారి ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
ఇప్పటికే తెలంగాణ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ (సోమవారం తెల్లవారుజామున) అత్యల్పంగా సంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లో 6.6 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. ఇక ఆదిలాబాద్ లో 6.8°C, వికారాబాద్ లో 7.8°C, కామారెడ్డిలో 8.2°C, నిజామాబాద్ లో 8.4°C, మెదక్ లో 8.4°C, రంగారెడ్డిలో 8.4°C, సిద్దిపేటలో 8.9°C, నిర్మల్ లో 9°C, సిరిసిల్లలో 9.2°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జిల్లాల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పడిపోయి ఎముకలు కొరికే చలిగాలులు వీస్తాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ లో అత్యల్ఫ ఉష్ణోగ్రతలు
హైదరాబాద్ లో కూడా సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. అత్యల్పంగా శేరిలింగంపల్లి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) పరిసరాల్లో 8.4°C నమోదయ్యింది. రాజేంద్రనగర్ లో 10.1, ఆల్వాల్ లో 10.6, బిహెచ్ఈఎల్ లో 10.6, రామచంద్రాపురంలో 12.2, నేరేడ్మెట్ లో 12.4, చందానగర్ లో 12.4, కిషన్ భాగ్ లో 13.1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. చలి తీవ్రత పెరగడంతో నగర ప్రజలు స్వెటర్లు లేదంటే వెచ్చని దుస్తులు లేకుండా బయటకు వచ్చేందుకు సాహసించడంలేదు.
ఈ తెలంగాణ జిల్లాల్లో ఎల్లో అలర్ట్
ఇక రాబోయే రెండుమూడు రోజులు అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుండి 4 డిగ్రీ సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్,మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్ల డిసెంబర్ 9, 10 తేదీల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందంటూ ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ లో 7.7, మెదక్ లో 9 డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. మిగతా జిల్లాల్లోనూ 5 నుండి 15°C ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని... అత్యంత చలి వాతావరణం ఉంటుందని హెచ్చరించింది.

