విశాఖపట్నం: సినీ నిర్మాత నూతన్ నాయుడి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని శిరోముండనం బాధితుడు శ్రీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని పెందుర్తిలో గల నూతన్ నాయుడి నివాసంలో శ్రీకాంత్ కు గుండు గీయించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు నూతన్ నాయుడి భార్య మధుప్రియతో పాటు ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

నూతన్ నాయుడు ఎంతకైనా తెగిస్తాడని శ్రీకాంత్ అన్నారు. తనకు భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దళితులపై ఇక ఎవరైనా దాడులు చేయాలంటే భయపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏ తప్పు కూడా లేకుండా దళితులను హింసించడం దారుణమని అన్నారు 

Also Read: నూతన్ నాయుడు జనసేనకు దగ్గర, పరాన్నజీవి నిర్మాత: ఎమ్మెల్యే

పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేశారని, అయితే ప్రధాన సూత్రధారి నూతన్ నాయుడిని అరెస్టు చేయలేదని దళిత సంఘాలు అంటున్నాయి. నూతన్ నాయుడిని అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 

ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక శ్రీకాంత్ భయపడుతున్నాడని, అతనికి రక్షణ కల్పించాలని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించి దళితులపై జరుగుతున్న దాదడులను ఆపాలని, శ్రీకాంత్ ను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. 

Also Read: శిరోముండనం బాధితుడు శ్రీకాంత్‌ను పరామర్శించిన మంత్రి అవంతి శ్రీనివాస్