Asianet News TeluguAsianet News Telugu

నూతన్ నాయుడు జనసేనకు దగ్గర, పరాన్నజీవి నిర్మాత: ఎమ్మెల్యే

నూతన్ నాయుడు వైసీపీకి దగ్గర అనే ప్రచారం జరుగుతుందని.... అది వాస్తవం కాదని ఆయన అన్నారు. అతను జనసేనకు చాలా దగ్గర అని, పరాన్నజీవి అనే సినిమాను కూడా తీసాడని ఈ సందర్భంగా అదీప్ రాజు గుర్తు చేసారు. 

Nutan Naidu Is Close to Jansena: MLA Adeep raju Clarifies
Author
Pendurthi, First Published Aug 31, 2020, 9:37 AM IST

విశాఖ జిల్లాలో జరిగిన శిరోముండనం ఘటన అత్యంత బాధాకరమని అన్నారు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు. శ్రీకాంత్ ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఇప్పటికే ఈ కేసులోని నిందితులను 24 గంటల్లోగా అరెస్ట్ చేసి రిమండ్ కి తరలించామని అన్నారు. 

ఇందులో నూతన్ నాయుడు పాత్ర ఉందని తేలితే.... ఆయనపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని తెలిపారు. నూతన్ నాయుడు వైసీపీకి దగ్గర అనే ప్రచారం జరుగుతుందని.... అది వాస్తవం కాదని ఆయన అన్నారు. అతను జనసేనకు చాలా దగ్గర అని, పరాన్నజీవి అనే సినిమాను కూడా తీసాడని ఈ సందర్భంగా అదీప్ రాజు గుర్తు చేసారు. 

శ్రీకాంత్ కు ప్రభుత్వం తోడుగా ఉంటుందని, అతనికి ఇంటిపట్టా, ఉద్యోగం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. వీటితోపాటు ఆర్ధిక సహకారాన్ని కూడా అందించి శ్రీకాంత్ ను ఆదుకుంటామని ఈ సందర్భంగా అదీప్ రాజు తెలిపారు. 

ఆదివారంనాడు శిరోముండనానికి గురైన శ్రీకాంత్ ను ఏపీ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ తో కలిసి ఎమ్మెల్యే ఆదీప్ రాజు పరామర్శించారు.భవిష్యత్తులో నూతన్ నాయుడు నుండి తనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని బాధితుడు మంత్రిని కోరారు. 

ప్రభుత్వం తరపున లక్ష రూపాయలు ఇవ్వనున్నట్టుగా మంత్రి హామీ ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగంతో పాటు, ఇళ్ల స్థలం ఇవ్వనున్నట్టుగా ఆయన హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే ఆదీప్ రాజ్ బాధితుడికి రూ. 50 వేలు ఆర్ధిక సహాయం చేశారు. 

ఈ తరహా ఘటనలపై ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారని మంత్రి చెప్పారు. ఈ తరహా ఘటనలను ముఖ్యమంత్రి ఉపేక్షించరని ఆయన గుర్తు చేశారు. విశాఖపట్టణంలో నూతన్ నాయుడు ఇంట్లో పనిచేసి మానేసిన శ్రీకాంత్ ను శిరోముండనం చేశారు. 

ఈ విషయమై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు చోటు చేసుకొన్న ఘటనలపై విపక్షాలు ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని టీడీపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.దళితులపై దాడులు, శిరోముండనం ఘటనలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొన్నాయి

Follow Us:
Download App:
  • android
  • ios