Vemireddy Prashanti Reddy: కనిగిరి రిజర్వాయర్ పునరుద్ధరణకు 48కోట్లు సీఎంకు కృతజ్ఞతలు

Share this Video

కనిగిరి రిజర్వాయర్ పునరుద్ధరణకు 48కోట్లు సీఎం చంద్రబాబుకు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కృతజ్ఞతలు 1973లో 3.45 T.M.C.ల సామర్థ్యం ఉన్న కనిగిరి రిజర్వాయర్ గత 50ఏళ్లలో పూడిక కారణంగా కారణంగా నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయిందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. కనిగిరి రిజర్వాయర్ పునరుద్ధరణకు 48 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయని రెండో పంటకు కూడా నీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది తీవ్రమైన ఎండలు ఉండే అవకాశం ఉన్నందున అధికారులు, సాగునీటి సంఘ నాయకులు, రైతు సంఘాల నాయకులు సమన్వయంతో పనిచేసి నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video