తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి వంగవీటి రాధాకృష్ణ షాక్ తప్పేలా లేదు. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో రాధ భేటీ పలు అనుమానాలను తావిస్తోంది.  

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లాకు చెందిన కీలక టిడిపి (tdp) నాయకుడు వంగవీటి రాధాకృష్ణ (vangaveeti radha) ఇప్పటికే టిడిపి రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (vallabhaneni vamsi)తో సమావేశమయ్యారు. విజయవాడ (vijayawada)లోని రాధా కార్యాలయంలో వీరిద్దరి భేటీ జరిగింది. 

కాపు నాయకుడు వంగవీటి మోహనరంగా (vangaveeti rangha) వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే వంశీ తన మిత్రుడు రాధాను కలిసారు. ఇద్దరూ కలిసి రంగా విగ్రహానికి పూలమల వేసి నివాళులు అర్పించారు. ఇది బాగానే వున్నా అంతకుముందు వీరిద్దరి మధ్య జరిగిన భేటీ రాజకీయంగా పలు చర్చలకు దారితీసింది. ఈ ఇద్దరి కలయిక ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. 

Video

ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని (kodali nani) ని కలిసారు వంగవీటి రాధా. వారిద్దరూ ఎంతో ఆప్యాయంగా పలకరించుకుని సరదాగా వున్నారు. కొద్దిసేపు మంత్రి నాని, రాధతో పాటు వైసిపి నాయకులు కొందరు ఓ గదిలో కూర్చుని మాట్లాడుకున్నారు. దీంతో వంగవీటి రాధ సొంతగూటికి (వైసిపి) చేరతారన్న ప్రచారం జరిగింది. 

read more నాదెండ్ల మనోహర్ తో భేటీ: పవన్ కల్యాణ్ వైపు వంగవీటి రాధా అడుగులు?

అయితే ఆ ప్రచారాన్ని రాధ కొట్టిపడేసారు. తాను కేవలం ఫంక్షన్ లో పాల్గొనడానికి వెళ్లినట్లు... అక్కడ మంత్రి నాని కనిపిస్తూ పలకరించినట్లు వివరించాడు. తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని... వైసిపి శ్రేణులు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాధ పేర్కొన్నారు. 

తాజాగా వల్లభనేని వంశీతో వంగవీటి రాధ భేటీ నేపథ్యంలోనూ గతంలో మాదిరిగానే ప్రచారం జరుగుతోంది. టిడిపి నుండి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ అధికార వైసిపి పక్షాన చేరిన విషయం తెలిసిందే. తన మిత్రుడయిన రాధను కూడా తిరిగి వైసిపికి దగ్గర చేసేందుకే వంశీ ప్రయత్నిస్తున్నారని... అందులో భాగంగానే తాజాగా రాధను కలిసారని ప్రచారం జరుగుతోంది. తాజా ప్రచారంపై వంగవీటి రాధ ఎలా స్పందిస్తారో చూడాలి. 

ఇదిలావుంటే రాధ బిజెపి (BJP), జనసేన పార్టీ (Janasena Party)లతో కూడా టచ్ లో వున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ (nadendla manohar) తో సమావేశమయ్యారు. విజయవాడలోన ఓ హోటల్లో వీరిద్దర భేటీ అయ్యారు. ఈ సమావేశం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. 

read more బెజవాడలో చంద్రబాబుకు షాక్: బిజెపిలోకి వంగవీటి రాధా?

ఏపీలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై వారి మధ్య జరిగినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న వంగవీటి రాధా జనేసనలో పవన్ కల్యాణ్ తర్వాతి స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ తో సమావేశం కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. జనసేనలో చేరే ఉద్దేశంతోనే వంగవీటి రాధా నాదెండ్ల మనోహర్ ను కలిసినట్లు ప్రచారం సాగింది.

గతంలో చిరంజీవి నాయకత్వలోని ప్రజారాజ్యం పార్టీలో కూడా వంగవీటి రాధా పనిచేశారు 2019 ఎన్నికలకు ముందు కూడా రాధా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. దాంతో రాధా జనసేనలో చేరుతారని ప్రచారం సాగింది.

వంగవీటి రాధా పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన టీడీపీకి రాజీనామా చేసి బిజెపిలో చేరుతారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల ఆయన హైదరాబాదులో కేంద్ర మంత్రి ఒకరిని కలిసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై వంగవీటి రాధా ఇప్పటివరకు స్పందించలేదు.