అలా జరిగేంత వరకు ఈ రాజకీయాలు మారవు.. సినీ నటుడు శివాజీ
దివంగత నాయకుడు ఎన్టీఆర్ (NTR) తెలుగు ప్రజలందరి సొత్తు అని సినీ నటుడు శివాజీ (Actor shivaji) అన్నారు. ఆయన తెలుగు ప్రజలందరి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టారని తెలిపారు. డబ్బుల కోసం ఎవరూ తమ ఓట్లు అమ్ముకోకూడదని కోరారు.
ఏపీ రాజకీయాలపై సినీ నటుడు శివాజీ హాట్ కామెంట్స్ చేశారు. డబ్బుల కోసం ఎవరూ ఓట్లు అమ్ముకోకూడదని సూచించారు. పిల్లల భవిష్యత్తు కోసం సరైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమానికి శివాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
దుర్మార్గుడు.. ఎద్దుతో బతికున్న కోడిని బలవంతంగా తినిపించిన యూట్యూబర్.. వైరల్..
ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టారని అన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరి సొత్తు అని తెలిపారు. యువకులందరూ పార్టీలోకి రావాలని ఆయన ఆకాంక్షించేవారని శివాజీ అన్నారు. ప్రస్తుతం రాజకీయాలు మారిపోయానని అన్నారు. డబ్బులు ఇచ్చి బీఫాంలు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. ఈ సంస్కృతి పోయేంత వరకు రాజకీయాలు మారబోవని స్పష్టం చేశారు.
‘‘నేను చిన్నప్పుడు ఇలాంటి ఇంట్లో ఉండి ఉంటే’’- స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ.. వైరల్
తనకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని శివాజీ అన్నారు. ఎవరూ ఆహ్వానించినా తాను ఆ కార్యక్రమానికి వెళ్తానని, రెండు మంచి మాటలు చెబుతానని తెలిపారు. దివంగత నాయకుడు ఎన్టీఆర్ ప్రస్తుత నేతల మాదిరిగా తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి తీసుకురాలేదని అన్నారు. వారికి దోపిడీలకు పాల్పడాలని సూచించలేదని అన్నారు.