అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పీపీఏల అంశం పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే 42 విద్యుత్ పంపిణీ సంస్థలు హైకోర్టులో పిటీషన్ దాఖలు వేసిన సంగతి మరువక ముందే మరో రెండు కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. 

పీపీఏలపై వైయస్ జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా హైకోర్టులో రెండు కంపెనీలు పిటీషన్ దాఖలు చేశాయి. సోలార్, విండ్ పవర్ కొనుగోళ్లను ఏపీ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపిస్తూ టాటా రెన్యువబుల్, వాల్ వాహన్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. 

రెండు కంపెనీల వేసిన పిటీషన్లను హైకోర్టు విచారణ ప్రారంభించింది. అయితే ప్రభుత్వం తరపున న్యాయవాది ఈనెల 22న అనుబంధ పిటిషన్లు ఉన్న కారణంగా అదే రోజు విచారణ చేపట్టాలని హైకోర్టును కోరారు. 

ప్రభుత్వ న్యాయవాది విచారణ విన్న హైకోర్టు విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది. ఇకపోతే పీపీఏల అంశంపై ఇప్పటి వరకు 42 విద్యుత్ పంపిణీ సంస్థలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.