Asianet News TeluguAsianet News Telugu

మీరు ఓడినా మీ పార్టీ ఉంటుంది, ఇరిటేషన్ తగ్గించండి: చంద్రబాబుకు ఉండవల్లి హితవు

తన ఓటు తనకే పడిందో లేదో తెలియదంటున్న చంద్రబాబు మరి 130 సీట్లతో అధికారంలోకి వస్తామని ఎలాం చెప్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రతీ అంశంపై ఇరిటేషన్‌కి గురవుతున్నారన్నారు. కొంచెం ఇరిటేషన్ తగ్గించుకోవాలని హితవు పలికారు. మీరు ఓడిపోయినా..మీ పార్టీ జనంలో ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉందని గుర్తు చేశారు. 

undavalli arun kumar sensational comments on chandrababu
Author
Vijayawada, First Published May 7, 2019, 2:20 PM IST

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. తాను చూసిన ఒకప్పటి చంద్రబాబు వేరు ప్రస్తుత చంద్రబాబు వేరు అంటూ చెప్పుకొచ్చారు. 

విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమంటూ చెప్పుకొచ్చారు. ఒక్కోసారి గెలవచ్చు మరోసారి ఓడిపోవచ్చన్నారు. చంద్రబాబు నాయుడు అధికారానికి దూరంగా పదేళ్లు లేరా అంటూ గుర్తు చేశారు. ఈవీఎంలపై చంద్రబాబు చేస్తున్న రాద్ధాంతం సరికాదన్నారు. 

ఈవీఎంలు, వీవీ ప్యాడ్ల స్లిప్పుల విధానాలన్నీ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. ఈవీఎంలపై ఎన్నికలు నిర్వహించినప్పుడు ఓడిపోయిన సమయంలో కూడా ఈవీఎంలపై చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదని..ఈవీఎంలతోనే ఎన్నికలకు వెళ్లి గెలిచిన సందర్భాల్లోనూ ఈవీఎంలపై ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదన్నారు. 

కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఈవీఎంలపై చంద్రబాబు రాద్ధాంతం చెయ్యడం సరికాదన్నారు. అసలు ఓటేసి తర్వాత మీడియా ముందుకొచ్చి తన ఓటు తనకే పడిందో లేదో తెలియదు అంటూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు వ్యాఖ్యానించారని విమర్శించారు. 

తన ఓటు తనకే పడిందో లేదో తెలియదంటున్న చంద్రబాబు మరి 130 సీట్లతో అధికారంలోకి వస్తామని ఎలాం చెప్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రతీ అంశంపై ఇరిటేషన్‌కి గురవుతున్నారన్నారు. కొంచెం ఇరిటేషన్ తగ్గించుకోవాలని హితవు పలికారు. 

మీరు ఓడిపోయినా..మీ పార్టీ జనంలో ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉందని గుర్తు చేశారు. చంద్రబాబు అంటే దేశంలోనే అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులలో ఒకరంటూ ప్రశంసించారు. అయితే రిజల్ట్స్ రాక ముందే ఎందుకు ఆవేశపడుతున్నారో అర్థం కావలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఏసీబీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుపై మాజీ ఎంపీ ఉండవల్లి కీలక వ్యాఖ్యలు

వైసీపీలో చేరే అంశంపై తేల్చేసిన మాజీఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్

సీఎం-సీఎస్ గొడవకు కారణమిదే: తేల్చేసిన ఉండవల్లి

సీఎం గారు.. పోలవరంలో తేడా వస్తే రాజమండ్రి మటాషే: ఉండవల్లి

Follow Us:
Download App:
  • android
  • ios