Asianet News TeluguAsianet News Telugu

సీఎం-సీఎస్ గొడవకు కారణమిదే: తేల్చేసిన ఉండవల్లి

ఆంధ్రప్రదేశ్‌‌లో సీఎం వర్సెస్ సీఎస్ గొడవ ఏంటో అర్ధం కావడం లేదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.

Ex MP undavalli arun kumar makes comments on CS vs CM fight in AP
Author
Vijayawada, First Published May 7, 2019, 1:34 PM IST

ఆంధ్రప్రదేశ్‌‌లో సీఎం వర్సెస్ సీఎస్ గొడవ ఏంటో అర్ధం కావడం లేదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో కూడా ఎన్నికల సంఘం కాంగ్రెస్ నేతలను చాలా ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు.

ఈసీ తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూ.. కోర్టుకు వెళ్లారని, కోర్టు మొట్టికాయలు వేస్తే ఎల్వీకీ సీఎస్‌గా బాధ్యతలు అప్పగించారన్నారు. చంద్రబాబు.. మోడీని  లేదా జగన్‌ని ఇతర నేతలను విమర్శించండి అంతేకానీ సీఎస్‌ను ఎందుకు విమర్శిస్తున్నారని ఉండవల్లి ప్రశ్నించారు.

చంద్రబాబు తనకు అనుకూలంగా ఉన్న వారికి బిల్లులు మంజూరు చేయాలని అనుకున్నారని.. అయితే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే సుబ్రమణ్యంపై సీఎం ఆరోపణలు చేస్తున్నారని ఉండవల్లి స్పష్టం చేశారు.

ఇప్పుడేమో వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని కోరుతున్నారని.. అసలు ఓటేసి మీడియా ముందుకు వచ్చి ఏ ముఖ్యమంత్రి కూడా తన ఓటు తనకు పడిందో లేదో తెలియడం లేదనడం సరికాదన్నారు.

బాబు ఇరిటేషన్‌కు గురవుతున్నారని.. ఆయన కొంచెం ఇరిటేషన్ తగ్గించుకోవాలని సూచించారు. చంద్రబాబు ఓడిపోయినా ఆయన పార్టీ జనంలోనే ఉంటుందని వచ్చేసారి అధికారంలోకి వస్తుందన్నారు.

కానీ రిజల్ట్ రాకముందే ఎందుకు ఆవేశపడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. 2014లో ఈవీఎంలతోనే గెలిచారని, ఇప్పుడు వాటితోనే ఎన్నికలకు వెళ్తే ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని ఉండవల్లి ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారని.. అందులో తేడా వస్తే అప్పుడు తప్పుబట్టాలని అరుణ్ కుమార్ సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios