పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడి అంటున్నారని అయితే ఈ ప్రాజెక్ట్ డిజైన్‌ విషయంలో ప్రభుత్వం వెళుతున్న దారి సరికాదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. 

పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడి అంటున్నారని అయితే ఈ ప్రాజెక్ట్ డిజైన్‌ విషయంలో ప్రభుత్వం వెళుతున్న దారి సరికాదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.

విజయవాడలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన .. పోలవరం నిర్మాణ ప్రాంతంలో భూమి పగుళ్లు ఏర్పడుతున్నాయని... ప్రమాదకర పరిస్ధితిలో ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందని... భవిష్యత్తులో తేడా వచ్చి డ్యాం డామేజ్ అయితే రాజమండ్రి కొట్టుకుపోతోందని హెచ్చరించారు.

అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాలు తుడుచుకుపోతాయన్నారు. నిపుణులను పంపి పరిశీలన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పోలవరం విషయంలో చాలా దారుణాలు జరుగుతున్నాయని అక్కడి అధికారులే స్వయంగా తనకు చెబుతున్నారని ఉండవల్లి ఆరోపించారు.

కాపర్ డ్యాం వల్ల ఎంత మునిగిపోతుంది... ఆ ప్రాంత ముంపు ప్రజలకు న్యాయం చేసారా..? ఇందుకు గాను రూ.30 వేల కోట్లు కావాలని.. వీటన్నింటికి చంద్రబాబు సమాధానం చెప్పాలని అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్, టీడీపీ ఒక్కటేగా.. కేవీపీపై ఉమా వ్యాఖ్యలేంటీ: ఉండవల్లి

పోలవరం నిర్మాణంలో టీడీపీ అనుసరిస్తున్న తీరు పూర్తిగా రాజకీయ కోణమేననన్నారు. అలాగే ఇండియా-పాకిస్తాన్‌లా, ఆంధ్రా-తెలంగాణ ప్రజలు ఒకరి మొఖం ఒకరు చూసుకోవడం లేదంటూ మోడీ వ్యాఖ్యానించడం దారుణమని ఉండవల్లి ధ్వజమెత్తారు. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విబేధాలు లేవని అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.