Tirupati Vaikunta Dwara Darshan: శ్రీవారి భక్తులకు శుభవార్త.. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా 2022, జనవరి 13వ తేదీ నుంచి 10 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్బంగా టీటీడీ అదనపు ఇవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది వైకుంఠ ద్వారా దర్శనం పది రోజుల పాటు తెరిచి ఉంచాలని నిర్ణయించినట్టు ధర్మారెడ్డి తెలిపారు
Tirupati Vaikunta Dwara Darshan: తిరుపతి వెంకన్న భక్తులకు శుభవార్త.. వైకుంఠ ద్వారా దర్శనం ( Vaikunta Dwara Darshan) విషయంలో కీలక మార్పులు చేసింది టీటీడీ దేవస్థానం. ఈ ఏడాది వైకుంఠ ద్వారా దర్శనాన్ని 10 రోజుల పాటు చేసుకునేలా ఏర్పాటు చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే భక్తులకు ఏడాది జనవరి 13 నుంచి 22 వరకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నారు.
ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోడానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో శ్రీవారిని దర్శించుకోవాలని చాలా మంది భక్తులు ఆసక్తి చూపిస్తారు. ఏకాదశి, ద్వాదశి ఈ రెండు రోజులే వైకుంఠ ద్వారం తెరిచి ఉండటం వల్ల ఎక్కువ మందికి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి అవకాశం లభించడం లేదు. అందుకే టీడీడీ వైకుంఠద్వారం పది రోజుల పాటు తెరువనున్నారు.
Read Also: KCR తెలంగాణ లోకల్.. వోకల్ .. అమిత్ షానే తెలంగాణ నాదిర్షా : MLA Jeevan Reddy
ఈ సందర్బంగా టీటీడీ అదనపు ఇవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది వైకుంఠ ద్వారా దర్శనం పది రోజుల పాటు తెరిచి ఉంచాలని నిర్ణయించినట్టు ధర్మారెడ్డి తెలిపారు. జనవరి 1 నుంచి 13న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇప్పటికే టికెట్లు విడుదల చేశామన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తులకు వసతి సమస్య లేకుండా తిరుపతిలో బస చేయాలని సూచించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఖచ్చితంగా కోవిడ్ సర్టిఫికేట్ తీసుకొని రావాలని అన్నారు. టికెట్లు కలిగివుండి.. కోవిడ్ లక్షణాలు వుంటే.. దయచేసి తిరుమలకు రావద్దని అని భక్తులకు విజ్ఞప్తి చేశాడు. పది రోజులు పాటు రోజుకు 5 వేల ఆఫ్ లైన్ టికెట్లు చొప్పున స్థానికులకు కేటాయించామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతికి చెందిన భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నారు.
Read Also: తిరుమల ఘాట్‌లో రోడ్ల మరమ్మత్తు పనులను పరిశీలించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (ఫోటోలు)
వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి ట్రస్ట్ భక్తులకు కూడా మహాలఘు దర్శనం మాత్రమే కల్పించడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి సంబర్బంగా ఏర్పాటు చేస్తున్నామని, 1300 రూములు రెనువేషన్ లో వున్నాయని తెలిపారు. ఈ క్రమంలో మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. జనవరి 11వ నుంచి 14 వరకు వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఆ నాలుగు రోజుల్లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కరెంట్ బుకింగ్ ద్వారా గదులు బుక్ చేసుకోవాలని సూచించారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం బంగారు రథంపై శ్రీవారు మాడ వీధిలో దర్శనం ఇస్తారని తెలిపారు. అలాగే.. జనవరి 1 నుంచి చెన్నై, బెంగుళూరు, హైదరాబాదు, ఒంటిమిట్ట ప్రాంతంలో శ్రీవారి ప్రసాదాలు అందుబాటులో వుంటాయని తెలిపారు.
Read Also: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని
దక్షిణాయనం ప్రారంభం ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు పాల కడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయణంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని అంటారు.