తిరుమల: రూ.300 దర్శన టికెట్లకు ఎగబడ్డ భక్తులు.. గంటలో 4.60 లక్షల టోకెన్ల విక్రయం

జనవరి నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను ఈరోజు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేసింది. ఉదయం 9 గంటలకు రూ. 300 టికెట్లను అమ్మకాలకు ఉంచింది. జనవరి నెలకు గాను మొత్తం 4.60 లక్షలను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయగా... కేవలం 60 నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. 

ttd special tickets for january month sold in one hour

జనవరి నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను ఈరోజు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేసింది. ఉదయం 9 గంటలకు రూ. 300 టికెట్లను అమ్మకాలకు ఉంచింది. జనవరి నెలకు గాను మొత్తం 4.60 లక్షలను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయగా... కేవలం 60 నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి.  జనవరి నెలకు సంబంధించి సర్వదర్శనం టికెట్లను ఇంకా విడుదల చేయాల్సి ఉంది. జనవరికి సంబంధించి వసతి బుకింగ్స్ ను ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది. 

కాగా.. తిరుమల (tirmula) శ్రీవారి ఆలయంలో ఉదయాస్తమాన సేవను (udayasthamana seva) టీటీడీ పునరుద్దరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టికెట్ల ధరను నిర్ణయించింది. సాధారణ రోజుల్లో ఉదయాస్తమాన సేవా టికెట్ కోటి రూపాయలు కాగా శుక్రవారం రోజున మాత్రం 1.5 కోట్లుగా టీటీడీ (ttd) నిర్ణయించింది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర 531 ఉదయాస్తమాన సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

Also Read:తిరుమల: ఉదయాస్తమాన సేవ పునరుద్ధరణ .. టికెట్ ధర అక్షరాల కోటిన్నర..!

ఈ టికెట్‌ కొనుగోలు చేసిన వారు దాదాపు 25 ఏళ్ల పాటు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు. ఏడాదికి ఒక్కరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఆరుగురు భక్తులు పాల్గొనే సౌలభ్యాన్ని కల్పిస్తారు. ఉదయాస్తమాన సేవా టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి దాదాపు రూ.600 కోట్ల పైగా ఆదాయం వస్తుంది. ఉదయాస్తమాన సేవా టికెట్ల కేటాయింపుతో లభించే మొత్తాన్ని చిన్నపిల్లల ఆస్పత్రి అభివృద్ధికి కేటాయించాలని టీటీడీ పాలకమండలి ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios