KCR తెలంగాణ లోకల్.. వోకల్ .. అమిత్ షానే తెలంగాణ నాదిర్షా : MLA Jeevan Reddy

కాంగ్రెస్, బీజేపీల‌పై పియూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం టీఆర్ఎస్ఎల్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి , ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడారు.  ఈ సంద‌ర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ..  రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు నాంపల్లి బ్రదర్స్ లా కలిసి పని చేస్తున్నారని, ఆ రెండు పార్టీలు నాంపల్లిలోనే ఉన్నాయ‌నీ, ఈ పార్టీకి ఆ పార్టీకి మ‌ధ్య సొరంగం తవ్వుకున్నార‌ని ఏద్దేవా చేశారు.
 

mla jeevan reddy fires on bjp and congress

MLA Jeevan Reddy:  కేసీఆర్ ను నాదర్శా తో పోల్చ‌డం స‌రికాద‌ని, నాదిర్షా ఇరాన్ నుంచి వచ్చి ఇండియా పై దండెత్తాడని పియూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి అన్నారు. కానీ.. కేసీఆర్..  తెలంగాణ లోకల్ వోకల్ .. అమిత్ షా నే తెలంగాణ పాలిట నాదిర్షా అని విమర్శించాడు. గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ పై దండెత్తుతున్న అమిత్ షా లాంటి వాళ్లే నాదర్శా లని, గుజరాత్ బేరగాళ్ల తో తెలంగాణ లో బీజేపీ అధికారం లోకి వస్తుందా ? వారి ఆటలు తెలంగాణ లో సాగ‌వ‌ని ఫైర్ అయ్యాడు. 

మంగ‌ళ‌వారం టీఆర్ఎస్ఎల్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి , ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడారు. ఈ మీట్ లో కాంగ్రెస్, బీజేపీల‌పై పియూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి విరుచుక‌ప‌డ్డారు.  రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు నాంపల్లి బ్రదర్స్ లా కలిసి పని చేస్తున్నారని, ఆ రెండు పార్టీలు నాంపల్లిలోనే ఉన్నాయ‌నీ, ఈ పార్టీకి ఆ పార్టీకి మ‌ధ్య సొరంగం తవ్వుకున్నార‌ని ఏద్దేవా చేశారు. ఈ రెండు పార్టీ నాయ‌కులు కోతులు,కొండముచ్చుల్లా ప్రవర్తిస్తున్నారని, రేవంత్ కోతి అయితే బండి సంజయ్ కొండ ముచ్చులా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. 

సంజయ్ కు నెత్తి లేదు.. ఆయ‌న‌కు ఉన్న‌ది నత్తి మాత్రమేన‌నీ, అలాగే.. రేవంత్ కు కత్తి లేదని.. మాటల‌తో  సుత్తి కొట్ట‌డ‌మే తెలుసున‌నీ అన్నారు. ఈ ఇద్ద‌రూ న‌త్తి, సుత్తి లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కోవిడ్ మార్గదర్శకాలు కేంద్రం విధించినవే అని వారిద్దరికీ తెలియవా? హై కోర్టు సూచనలు కూడా తెలియవా ?  రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఆంక్షలు విధించలేదని అన్నారు. ఇలా అక్కరకు రాని అంశాలపై రేవంత్ బండి రచ్చ చేయ‌డం స‌రికాద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
తెలంగాణ ఆరోగ్య రంగం లో సాధించిన ప్రగతిని నీతి ఆయోగ్ మెచ్చుకుందనీ, దేశవ్యాప్తంగా ఈ విష‌యంపై ప్ర‌సంశ‌లు అందుతున్నయని అన్నారు. ఈ విష‌యం వారికి మాత్రం కనబడడం లేదని అన్నారు.

Read Also: ఏపీలో పరిస్థితులను కేంద్రం టెలిస్కోప్‌తో చూస్తోంది: బీజేపీ ఎంపీ సీఎం రమేష్

ఈ రెండు పార్టీలు  సోషల్ మీడియాలో హల్ చల్ చేయ‌డం త‌ప్పా.. వారు ప్రజలు చేసింది ఏం లేద‌ని అన్నారు. అబద్దాలకు రేవంత్ బ్రాండ్ అంబాసిట‌ర్ అయితే..  అరాచకాలకు బండి సంజయ్ అంబాసిట‌ర్ అని విమ‌ర్శించారు. రేవంత్ రచ్చబండ అని ప్రారంభించిన కార్య‌క్ర‌మం కాంగ్రెస్ కు గుదిబండ గా మారింద‌ని,  జగ్గారెడ్డి ప్రశ్నలకి ముందు రేవంత్ సమాధానం చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ 150 ఎకరాల్లో వరి వేశారనేది అబద్ధమ‌నీ, ఆయ‌న‌కు అంత భూమే లేదని అన్నారు.  కేసీఆర్ ధాన్యం ప్రభుత్వం కొంటే..  అప్పుడు ఆడగాలని, అసలు కొనుగోలు కేంద్రాలు లేకపోతే ఎవరు కొంటారని ప్ర‌శ్నించారు. 

Read Also: బీజేపీని సుజనా చౌదరి, సీఎం రమేష్‌లకు లీజు: మంత్రి పేర్ని నాని ఫైర్

కాంగ్రెస్ ఛీప్ రేవంత్ .. ఆత్మ బీజేపీ చుట్టే తిరుగుతోందనీ, అస‌లు తెలంగాణ వరి ధాన్యం విష‌యాన్ని పార్ల‌మెంట్ లో ప్ర‌శ్నించ‌మ‌ని సోనియా, రాహుల్ ల‌కు ఎందుకు చెప్ప‌డం లేద‌ని అన్నారు. కేసీఆర్ దీక్ష గురించి వంకరగా మాట్లాడితే ఆ దేవుడే వారిని శిక్షిస్తాడనీ, కేసీఆర్ దీక్ష లేకపోతే తెలంగాణ వ‌చ్చేదా? ఈ రోజు తెలంగాణ‌లో కాంగ్రెస్, బీజేపీ లకు శాఖలు ఉండేవా? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్, బీజేపీ సీఎం లను హైద్రాబాద్ రప్పిస్తే పథకాలు ఎలా ఉండాలో కేసీఆర్ వారికి క్లాస్ లు చెబుతారని చెప్పారు. రైతు బంధు, కళ్యాణాలక్ష్మి లాంటి పథకాలు వేరే రాష్ట్రాల్లో ఉన్నాయా? ఛత్తీస్ ఘడ్ కన్నా ఎన్నో పథకాలు తెలంగాణ లో అమలవుతున్నాయని అన్నారు.

Read Also: సెక్రటేరియట్ ముట్టడికి ఉపాధ్యాయ సంఘాల యత్నం: అరెస్ట్ చేసిన పోలీసులు
 

అమృత్ సర్ లో గెలవని తరుణ్ చుగ్ కేసీఆర్ ను విమర్శించ‌డం స‌రికాద‌ని, కేసీఆర్ రాజకీయ అనుభవం అంతా వ‌య‌స్సు చుగ్ కు లేద‌ని, కేసీఆర్ సింహం లాంటోడనీ, ఎలుక లాంటి తరుణ్ చుగ్ ఆయన గురించి మాట్లాడటమా అని విమ‌ర్శించారు. తప్పుడు పత్రాలు చూపించడం లో రేవంత్ సిద్ధహస్తుడనీ, ఆయ‌న చూపింది.. చెప్పింది.. ఏది సరికాద‌నీ అన్నారు.  ఇప్పటిదాకా ఏదీ నిజం కాలేదనీ, రేవంత్ రెడ్డికి బ్లాక్ మెయిలింగ్  తప్ప ఏదీ చేత‌కాద‌ని అన్నారు.

నిరుద్యోగం గురించి బండి సంజయ్ ఏదైనా చెప్పాలనుకుంటే మోడీ కి చెప్పాలి. కానీ,  కేసీఆర్ కు కాదని అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు పరంగా భారీ గా ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణనేని అన్నారు. కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకుని కొందరు నాయ‌కులు అష్ట దరిద్రులుగా మారిపోయారని మండిపడ్డారు. రైతు బంధు మరో విడత కూడా రైతుల అకౌంట్ల లో నేటి నుంచి జమ అవుతోందనీ, ఇలాంటి పథకం కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉందా? అని ప్ర‌శ్నించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios