2018 లో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన కోడి కత్తి దాడి కేసులో కుట్ర కోణం లేదని విజయవాడ ఎన్ఐఏ కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో ఎన్‌ఐఏ వాదనతో ఏకీభవిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో 2018లో జరిగిన కత్తితో దాడి ఘటనపై లోతుగా విచారణ జరిపించాలని ఆయన తరఫున దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ దాడిలో ఎలాంటి కుట్ర కోణమూ లేదని తెలిపింది. సీఎం తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు.. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావడానికి అనుమతించాలని కోరుతూ సీఎం వేసిన మరో పిటిషన్‌పై విచారణను ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేసింది. దీంతో పాటు ఈ కేసులో నిందితుడిగా ఉన్న జె.శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేసింది.

ఆన్ లైన్ డేటింగ్ యాప్ లో పరిచయం.. మహిళను హోటల్ కు పిలిపించి అత్యాచారం..

కత్తి దాడి వెనుక ఎలాంటి కుట్ర లేదని నేషనల్ ఇన్వెస్టిగేషన్ (ఎన్‌ఐఏ) గతంలోనే కోర్టుకు తెలిపింది. అయితే దీనిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తరఫు న్యాయవాది పిటిషన్ ఏప్రిల్ 10వ తేదీన పిటిషన్ దాఖలు చేస్తూ.. కోడి కత్తి దాడి కేసులో ఎన్ఐఏ సరిగా దర్యాప్తు జరపలేదని, మళ్లీ దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. తన వాదనల సమయంలో ఏఎన్ఐ ఎయిర్‌పోర్టు రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్‌కు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని కోర్టుకు తెలిపింది. ఈ రెండు పిటిషన్ లపై ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి వాదనలు, ప్రతివాదనలు విన్నారు. అనంతరం మంగళవారం తీర్పు చెప్పారు. 

పబ్జీతో మొదలైన స్నేహం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం.. ఏకాంతంగా ఉన్న వీడియోలు తీసి..

కాగా.. 2018 అక్టోబరు 25వ తేదీన విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌మోహన్‌రెడ్డిపై కోడిపందాలకు ఉపయోగించే చిన్న కత్తితో శ్రీనివాస్‌రావు అనే వ్యక్తి దాడి చేశాడు. దీంతో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి చేతికి గాయమైంది. దీంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ కేసును రాష్ట్ర పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అప్పగించింది, అయితే రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సంస్థలపై తనకు నమ్మకం లేదంటూ జగన్ మోహన్ రెడ్డి తన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి నిరాకరించారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, తరచూ వీడియోలు పెడుతోందని చెల్లెలి హత్య.. భద్రాద్రి కొత్తగూడెంలో ఘటన

అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి, ఈ కేసుపై కేంద్ర ఏజెన్సీతో విచారణ జరిపించాలని కోరింది. కోర్టు ఆదేశాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్ 31వ తేదీన ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించింది. జనవరి 1, 2019న ఎన్ఐఏ కేసు నమోదు చేసింది.