టీడీపీ నేత కేఈ ప్రభాకర్ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులను గేటు బయట నిలబెడతామన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా సారా వ్యాపారం చేస్తున్న వారిని మాత్రం ఎందుకు ముట్టుకోవడం లేదని ప్రభాకర్ ప్రశ్నించారు.

Also Read:మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి భారీ షాక్

ఇవాళ తమ ఇంట్లోకి వచ్చిన పోలీసులను అధికారంలోకి వచ్చిన తర్వాత గేటు బయట నిలబెడతామని హెచ్చరించారు. శుక్రవారం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేఈ ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తామేంటో చూపిస్తానని... పోలీసుల వ్యవహారంలో జేసీ దివాకర్ రెడ్డిలాగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. 

గతేడాది డిసెంబర్‌లో పోలీసులపై అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు వెన్నెముక లేకుండా వంగిపోతున్నారని విమర్శించారు. కొందరు పనికిరాని పోలీసులపై తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు జేసీ తెలిపారు.

Also Read:మా బూట్లు నాకే పోలీసులను తెచ్చుకొంటాం, జగన్ మరో రాజారెడ్డి: జేసీ సంచలనం

తమ పార్టీ త్వరలోనే అధికారంలోకి వస్తుందని.. అప్పుడు తమ బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామని, కొందరి అంతు చూస్తానంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.