టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారన్న అభియోగాలపై అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో పోలీసు అధికారుల సంఘం కేసు నమోదు చేసింది. జేసీపై 153(ఏ), 506 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసినట్లుగా తెలుస్తోంది.  

కొద్దిరోజుల క్రితం పోలీసులు వైసీపీ నేతలకు వంగి వంగి దండాలు పెడుతున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ త్వరలోనే అధికారంలోకి వస్తోందని జేసీ దివాకర్ రెడ్డి థీమాను వ్యక్తం చేశారు. 

Also Read:మా బూట్లు నాకే పోలీసులను తెచ్చుకొంటాం, జగన్ మరో రాజారెడ్డి: జేసీ సంచలనం

తాము అధికారంలోకి వచ్చిన సమయంలో తమ బూట్లు నాకే పోలీసులను తెచ్చుకొంటామని జేసీ దివాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. అప్పుడు మీ అంతు చూస్తానని జేసీ దివాకర్ రెడ్డి హెచ్చరించారు

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జేబుల్లో గంజాయి పెట్టించి కేసుల్లో ఇరికిస్తానని జేసీ దివాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. చంద్రబాబునాయుడు కూడ సాధు జంతువులా ఉండొద్దని ఆయన హితవు పలికారు

Also Read:మీసం తిప్పితే జేసీ బజారునపడ్డాడు: పోలీసు బూట్లను ముద్దాడిన గోరంట్ల

చాలా మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వొద్దని తాను చంద్రబాబుకు చెప్పిన విషయాన్ని జేసీ దివాకర్ రెడ్డి గుర్తు చేసుకొన్నారు. అయినా ఆ సమయంలో చంద్రబాబునాయుడు తన మాట వినలేదన్నారు. జగన్ గురించి తాను చాలాసార్లు చంద్రబాబుకు చెప్పినట్టుగా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు