Asianet News TeluguAsianet News Telugu

జగన్ ప్రమాణ స్వీకారానికి టీడీపీ దూరం: కారణం అదేనా....?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈనెల 30న వైయస్ జగన్ చేయబోతున్న ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేశారు. 
 

TDP's distance to Jagan's swearing
Author
Amaravathi, First Published May 28, 2019, 8:25 PM IST


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈనెల 30న వైయస్ జగన్ చేయబోతున్న ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు జగన్ స్వయంగా ఫోన్ చేశారు. 

అయితే ఆ సమయంలో చంద్రబాబు వేరే కార్యక్రమాల్లో ఉండటంతో ఫోన్ లో మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత  వైసీపీ కేంద్ర కార్యాలయం చంద్రబాబుకు ఫోన్ చేసి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. 

అయితే గత అనుభవాల దృష్ట్యా జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరుకాకూడదని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. 2014లో తాను సీఎంగా చేస్తున్న ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా కోరేందుకు ప్రయత్నించగా జగన్ అందుబాటులో లేకుండా పోయారు. 

జగన్ హాజరుకాలేకపోయినా కనీసం వైసీపీ ప్రతినిధి బృందాన్ని సైతం పంపలేదు. ఇకపోతే అత్యంత ప్రతిష్టాత్మకమైన అమరావతి రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు కూడా హాజరు కావాలని మంత్రుల బృందం వైయస్ జగన్ నివాసమైన లోటస్ పాండ్ కు వెళ్లింది. 

అయితే మంత్రుల బృందాన్ని కలిసేందుకు జగన్ నిరాకరించారు. ఈ పరిణామాలను గుర్తుకు తెచ్చిన టీడీపీ శ్రేణులు జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావొద్దని నిర్ణయించారు. అంతేకాదు జగన్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, కార్యకర్తలు తొందరపడొద్దని చంద్రబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబుకు జగన్ ఫోన్: ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం

డీఎంకే చీఫ్ కు జగన్ ఫోన్: ఎల్లుండి ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ హాజరు

Follow Us:
Download App:
  • android
  • ios