అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ చేయబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి అతిరథమహారథులను ఆహ్వానిస్తున్నారు వైయస్ జగన్. 

ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర కీలక నేతలతోపాటు ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాలను కోరారు. అలాగే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు స్వయంగా ఫోన్ చేసి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా కోరారు. 

తాజాగా డీఎంకే చీఫ్ స్టాలిన్ కు సైతం వైయస్ జగన్ ఫోన్ చేశారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు వస్తున్నట్లు డీఎంకే పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం ఉదయం ఆయన విజయవాడ చేరుకుంటారని తెలిపాయి. 
 

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబుకు జగన్ ఫోన్: ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం