Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు జగన్ ఫోన్: ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశారు. ఈ నెల 30న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా జగన్.. బాబును ఆహ్వానించారు. 

ys jagan makes phone call to chandrababu
Author
Amaravathi, First Published May 28, 2019, 12:59 PM IST

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశారు. ఈ నెల 30న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా జగన్.. బాబును ఆహ్వానించారు.

ఈ నెల 30న ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో 12.23 నిమిషాలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని.. మీరు కూడా హాజరు కావాలని జగన్ కోరినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లను జగన్ తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం తెలిసిందే. తాజాగా బాబును కూడా ఆహ్వానించడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

బాబు పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు చెబుతూ జగన్ ట్వీట్ చేయడం, అలాగే జగన్ పుట్టినరోజు నాడు చంద్రబాబు ట్వీట్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.

మరోవైపు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌తో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, డీజీపీ ఆర్పీ ఠాకూర్ భేటీ అయ్యారు. తన ప్రమాణ స్వీకారంతో పాటు రాష్ట్రంలో శాంతిభద్రతలు, వివిధ శాఖల స్థితిగతులపై జగన్ చర్చించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఈ భేటీలో కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, ట్రాఫిక్ డీసీపీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

ఇప్పటికే జగన్ తన ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని మన్నించిన కేసీఆర్.. ఈ నెల 29న విజయవాడకు వెళ్లనున్నారు.

జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత ఇద్దరు సీఎంలు కలిసి ఢిల్లీకి బయలుదేరనున్నారు. అక్కడ ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios