జీవీఎల్ చిట్టా బయట పెడతా, లేకపోతే రాష్ట్రం విడిచిపోతా: బుద్దా వెంకన్న

TDP MLC buddha venkanna sensational comments on GVL Narasimha rao
Highlights


 బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అవినీతి చిట్టా తన వద్ద ఉందని  టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు. త్వరలోనే జీవీఎల్ నరసింహారావు అవినీతిని బట్టబయలు చేస్తానని ప్రకటించారు. 


విజయవాడ: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అవినీతి చిట్టా తన వద్ద ఉందని  టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు. త్వరలోనే జీవీఎల్ నరసింహారావు అవినీతిని బట్టబయలు చేస్తానని ప్రకటించారు. ఒకవేళ అలా చేయకపోతే తాను రాష్ట్రం విడిచి వెళ్లిపోతానని ఛాలెంజ్ చేశారు.

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన విమర్శలపై ఆయన మండిపడ్డారు. ఈ విమర్శలపై  గురువారం నాడు ఆయన మండిపడ్డారు. జీవీల్ పెద్ద పవర్ బ్రోకర్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. జీవీఎల్ అవినీతి చిట్టా అంతా తన వద్ద ఉందన్నారు. 

బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చేయాల్సి వస్తోందనే కారణంగానే  రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో ఓటు చేయకుండా వైసీపీ దూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా యూటర్న్ బోర్డు ఉంటుందో అక్కడ జగన్ ఫోటో పెట్టాలని వెంకన్న వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

జగన్ చెప్పిన మాటపై ఏనాడూ కూడ నిలబడలేదని ఆయన చెప్పారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఓటు చేసేందుకు వచ్చిన అవకాశాన్ని  జగన్ వదులుకోవడాన్ని బుద్దా వెంకన్న తప్పుబట్టారు. 

 

ఈ  వార్తలు చదవండి:ఆ స్కాములపై టీడీపీ సమాధానం చెప్పాలి: జీవీఎల్

ఓటేయకుండా వైసీపీ పారిపోయింది: లోకేష్

 

loader