ఆ స్కాములపై టీడీపీ సమాధానం చెప్పాలి: జీవీఎల్

Bjp MP GVL Narasimha Rao slams on TDP
Highlights

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్  ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ సింగ్ ఎన్నిక కావడంతో  టీడీపీపై  బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు విమర్శలు గుప్పించారు.

న్యూఢిల్లీ:రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్  ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ సింగ్ ఎన్నిక కావడంతో  టీడీపీపై  బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు విమర్శలు గుప్పించారు.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో హరివంశ్ ఎన్నికైన తర్వాత  న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లా టీడీపీ కూడా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. 

స్కాములపై టీడీపీ సమాధానం చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. త్వరలో టీడీపీని ప్రజల ముందు దోషిగా నిలబెడతామని జీవీఎల్ చెప్పారు.  రాష్ట్ర అభివృద్ధిని వదిలేసి రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతోందన్నారు. 

కొంతకాలంగా టీడీపీపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏపీ రాష్ట్రంలో పాలనను టీడీపీ పక్కన పెట్టిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ  వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. అవకాశం దొరికినప్పుడల్లా జీవీఎల్ నరసింహారావు టీడీపీపై విమర్శలను గుప్పిస్తున్నారు. 


 

loader