ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు ఓటేసిన వైసీపీ రాజ్యసభ డీప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఓటు చేయకుండా పారిపోయిందని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు.
అమరావతి: ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు ఓటేసిన వైసీపీ రాజ్యసభ డీప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఓటు చేయకుండా పారిపోయిందని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు.
గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఓటు చేయకుండా ఓ పార్టీ పారిపోయిందని వైసీపీపై లోకేష్ పరోక్షంగా విమర్శలు చేశారు.బీజేపీతో లాలూచీపడినందునే ఆ పార్టీ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో ఓటు చేయకుండా పారిపోయిందన్నారు.
ఎన్డీఏలో ఉంటే అభివృద్ది చేసినట్టు... ఎన్డీఏ నుండి బయటకు వెళ్తే స్కామ్‌లు చేస్తున్నట్టా అని ప్రశ్నించారు. పంచాయితీరాజ్ వ్యవస్థను నడిచేదీ పీడీ అకౌంట్లపైనా అని లోకేష్ గుర్తు చేశారు. జీవీఎల్ నరసింహారావు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.
ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ప్రథమ స్థానంలో నిలవడం జీవీఎల్ సహించలేకపోతున్నారని లోకేష్ ప్రశ్నించారు. ఎన్డీఏకు వ్యతిరేకంగా ఓటు చేసే అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకొన్నట్టు చెప్పారు.
