అసెంబ్లీలో జరిగింది బయటకు రానివ్వలేదు.. రికార్డులు మాయం చేశారు.. టీడీపీ ఎమ్మెల్యేల సంచలన ఆరోపణ
నిత్యంప్రజాసమస్యలపై చిత్తశుద్ధితో ప్రతిపక్షంపోరాడుతుండ టాన్ని ఓర్వలేకనే.. నిన్న అసెంబ్లీలో వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు పశువుల్లాప్రవర్తించారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ (anagani satya prasad) మండిపడ్డారు. నిన్న అసెంబ్లీలో (AP Assembly) జరిగిన పరిణామాలపై టీడీపీ ఎమ్మెల్యేలు.. అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాజేస్వామి, ఏలూరి సాంబశివరావులు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో (ap assembly sessions) తన సతీమణిని దూషించారంటూ తెలుగు దేశం పార్టీ (telugu desam party) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) మీడియా సమావేశంలో బోరున విలపించడం.. రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాయి. అయితే నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై టీడీపీ ఎమ్మెల్యేలు.. అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాజేస్వామి, ఏలూరి సాంబశివరావులు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు.
నిత్యంప్రజాసమస్యలపై చిత్తశుద్ధితో ప్రతిపక్షంపోరాడుతుండ టాన్ని ఓర్వలేకనే.. నిన్న అసెంబ్లీలో వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు పశువుల్లాప్రవర్తించారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ (anagani satya prasad) మండిపడ్డారు. చేసిన దుర్మార్గాన్ని మర్చిపోయి.. వారి చర్యలను సమర్థించుకోవడం హేయాతి హేయమని ఆగ్ర హం వ్యక్తంచేశారు. ప్రజా సమస్యలపై తాము నోటీసులు ఇస్తే వాటిపై చర్చించకుండా ప్రభుత్వ పెద్దలు కుప్పం రాగం అలపించారని విమర్శించారు. కుప్పంఎన్నికతోపాటు, ప్రజలుఎదుర్కొంటున్న సమస్యలు, వివేకాహత్యపైచర్చించాలని తాము డిమాండ్ చేస్తే.. వక్రీకరించి, ఇష్టానుసారం మాట్లాడారని అన్నారు. మంత్రి కన్నబాబు, ఇతర మంత్రులు కావాలనే చంద్రబాబుపై దూషణలకు దిగారని చెప్పారు. కన్నబాబు.. అమరావతి రైతులను కూడా తూలా నాడాడని, వారి ఉద్యమాన్ని హేళనచేసేలా మాట్లాడాడని అన్నారు. రైతులను ఉద్దేశించి రియల్ ఎస్టేట్ గ్రూప్ అని మంత్రి అన్నప్పుడు, తాము మైక్ ఇవ్వాలనికోరితేస్పీకర్ నిరాకరించారని అన్నారు.
Also read: 'ఒరేయ్ నాని, వంశీ జాగ్రత్తగా ఉండండి.. గాజులు తొడుక్కుని కూర్చోలేదు'.. నందమూరి రామకృష్ణ వార్నింగ్..
ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబునాయుడిగారిపైవ్యక్తిగత దూషణలకు దిగడమే గాక, లోకేశ్ గారి గురించి అసభ్యంగా మాట్లాడాడు. వారు అలా అంటున్నా స్పీకర్ వారించలేదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఒకతల్లికే పుట్టాడు. అలాంటివ్యక్తి నోటి కొచ్చినట్లు మాట్లాడుతుంటే ఎవరూ వారించకపోగా, ఇంకా కొందరు అతనికిజతకలిశారు. రాష్ట్రంలోని డ్రగ్స్ మూలాల న్నీ చంద్రశేఖర్ రెడ్డిచుట్టూనే తిరుగుతున్నాయి. చంద్రబాబు గుండెనిబ్బరాన్ని, మనోస్థైర్యాన్ని దెబ్బకొట్టాలన్న కుతంత్రంతోనే ముఖ్యమంత్రి వ్యవహరించారు. అంబటి రాంబాబు పేట్రేగిపోతుంటే, ఆయన్ని వారించడానికి తాము స్పీకర్ ని మైక్ అడిగితే ఇవ్వలేదు. ఆడవాళ్లప్రస్తావన, కుటుంబసభ్యుల ప్రస్తావన సభలో చేయడం జుగుప్సాకరం. వైసీపీ ఎమ్మెల్యలను, మంత్రులను హెచ్చరిస్తున్నాం. ఇలానే మీరుప్రవర్తిస్తే, భవిష్యత్ లో అన్నివిధాలా చులకన అవుతారు. బాబాయ్‌ని చంపించి రక్తపుమరకలు ఎలాగైతే తుడిపేశారో, నిన్నఅసెంబ్లీలో జరిగినదాన్ని బయటకు రాకుండా, స్పీకర్ సాయంతో రూపుమాపారు. రికార్డులను మాయంచేసి, చంద్రబాబుని ఏమీ అనలేదని చెప్పడం దుర్మా ర్గం కాదా’ అని అనగాని ప్రశ్నించారు.
డోలా బాల వీరాంజనేయస్వామి (dola bala veeranjaneya swamy) మాట్లాడుతూ.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ప్రతిపక్షాలపై బురదజల్లుతూ, రాష్ట్రాన్ని అప్పులపాలుచేశాడని ఆరోపించారు. భువనేశ్వరిని వైసీపీ ఎమ్మెల్యేలు దూషిస్తుంటే.. మహిళా సాధికారతపై జగన్ రెడ్డిని పొగిడిన అక్కా చెల్లమ్మలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ద్వారంపూడి చంద్రశే ఖర్ రెడ్డి, కొడాలినాని, వెల్లంపల్లి శ్రీనివాస్, అంబటిరాంబాబు తోపాటు, మరో పాతికమంది వైసీపీఎమ్మెల్యేలు ఎన్నిబూతు లు మాట్లాడాలో అన్నీ మాట్లాడారని అన్నారు. జగన్ స్క్రిప్ట్ ప్రకారమే ఇదంతా జరిగిందని ఆరోపించారు.
‘జగన్మోహన్ రెడ్డి వివేకానందరెడ్డిని టీడీపీ ఓడించిందని.. అందుకే ఆయన చనిపోయాడని ఏదేదో మాట్లాడాడు. మరికుప్పంలో మీరుఎలా టీడీపీని ఓడించారో ప్రజలకు తెలియదా?. కుప్పంలో ఓడిపోయినవ్యక్తి ముఖం చూడాలని పైశాచిక ఆనందం పొందడం ముఖ్యమంత్రి స్థాయికి తగునా?. వైసీపీ నేతల బూతులను తొలగించి.. ముఖ్యమంత్రి అమాయకంగా మావాళ్లు ఏమీఅనలేదు.. కావాలంటే రికార్డులు చూసుకోండని అనడం ఏమిటి?. జగన్మోహన్ రెడ్డికి నిజంగా మహిళలపై గౌరవం, మహిళాసాధికారత పై నమ్మకముంటే, తక్షణమే ద్వారంపూడిని, అంబటి రాంబా బుని, మంత్రులు కొడాలి, వెల్లంపల్లిలపైచర్యలు తీసుకోవాలి. వారితో బహిరంగంగా క్షమాపణలు చెప్పించాలి. వైసీపీ పతనం ప్రారంభమైంది’ అని బాల వీరాంజనేయస్వామి అన్నారు.
ఏలూరి సాంబశివరావు (yeluri sambasiva rao) మాట్లాడుతూ.. రెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం పరిపాలనలో ఘోరంగా విఫలమైందన్నారు. జగన్ తన స్వార్దం కోసం రాజకీయాలను వాడుకుంటున్నాడని తెలిపారు. ‘జగన్ అక్రమాలను తెలుగుదేశం ప్రజల్లోకి తీసుకెళుతోందనే భావించే నిన్న అసెంబ్లీలో వైసీపీ నాయకులు బరితెగించాడు. చంద్రబాబు నాయుడి ఇంటిపైదాడి, టీడీపీ కార్యాలయంపై దాడి వంటి చర్యలతో పాటు.. అనేక రకాలుగా టీడీపీ నాయకులను వేధింపులకు గురిచేశారు. ఎన్నిచేసినా ఎంతలా నొప్పించినా చంద్రబాబునాయుడనే వ్యక్తి తన స్థైర్యాన్నికోల్పోవడం లేదనే, నిన్న తన పార్టీవారితో జగన్ అనరాని మాటలనిపించారు. జాతీయస్థాయిలో మచ్చలేని నిఖార్సైన నాయకుడు చంద్రబాబునాయుడు. స్వర్గీయఎన్టీఆర్ తర్వాత ప్రజలమనస్సుల్లో చెరగని స్థానం పొందినవ్యక్తి చంద్రబాబునాయుడు. అసెంబ్లీలో అధికారపార్టీ వారు మైక్ ల్లో రికార్డయ్యేలా మాట్లాడేది చాలా తక్కువ. విడిగా పెద్దగొంతుతో అరుస్తూ అనరాని మాటలు అనడమే ఎక్కువ జరుగుతోంది.
ప్రజలంతా వైసీపీనేతలకు ఈప్రభుత్వానికి తగినవిధంగా బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. వైసీపీనేతల వికృతచేష్టల కు ప్రతితెలుగువారి గుండె గాయపడింది. ఈ ప్రభుత్వానికి కాలంచెల్లిందని ప్రజలే అంటున్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరూ చంద్రబాబునాయుడిగారికి జరిగిన అవమానాన్ని సహించలేకపోతున్నారు. టీడీపీ కార్యకర్తలందరూ తమనాయకుడికి జరిగిన అవమానాన్ని , భాధని గుండెల్లోనే ఉంచుకొని, పౌరుషంగా మార్చుకొని చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేసేవరకు విశ్రమించ కుండా కృషిచేయాలని కోరతున్నాం. సమాజంలో రాజకీయాలకుఅతీతంగా ప్రవర్తించే విజ్ఞులు,మేథావులు కూడా నిన్నజరిగిన సంఘటనపై ఆలోచించాలి’ అని ఏలూరి సాంబశివరావు అన్నారు.