'ఒరేయ్ నాని, వంశీ జాగ్రత్తగా ఉండండి.. గాజులు తొడుక్కుని కూర్చోలేదు'.. నందమూరి రామకృష్ణ వార్నింగ్..
తమ ఆడపడుచుకు జరిగినట్టుగా ఎవరికి జరగకూడదని నందమూరి తారకరామరావు కుమారుడు నందమూరి రామకృష్ణ (nandamuri harikrishna) ఆవేదన వ్యక్తం చేశారు. తాను కొన్ని పేర్లు తీసుకురావాల్సి వస్తుందని.. నానిగా, వంశీగా అంటూ ఫైర్ అయ్యారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని కోరారు.
దేవాలయం లాంటి నందమూరి కుటుంబం మీద ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే సహించబోమని నందమూరి తారకరామరావు కుమారుడు నందమూరి రామకృష్ణ హెచ్చరించారు. ఆడవాళ్ల మీద ఇలాంటి మాటలు మాట్లాడటం దారుణం అన్నారు. తమ ఆడపడుచుకు జరిగినట్టుగా ఎవరికి జరగకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కొన్ని పేర్లు తీసుకురావాల్సి వస్తుందని.. పరిస్థితులు అలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ‘ఓరేయ్ నానిగా, వంశీగా, అంబటి రాంబాబు, ద్వారం పూడి చంద్రశేఖర్.. హద్దులు మీరిపోయారు.. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో ఆడవాళ్లు మీ గురించి ఏం అనుకుంటున్నారో చూసుకోండి’ అని అన్నారు. తమ కుటుంబం మొత్తం చాలా బాధ పడుతుందని చెప్పారు. ఏదైనా రాజకీయంగా చూసుకోవాలని.. పర్సనల్‌గా ఇలాంటి వ్యాఖ్యలు గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. తాము గాజులు తొడుక్కొని కూర్చోలేదని ఫైర్ అయ్యారు. తమ తండ్రి తమకు కొన్ని హద్దులు పెట్టారని.. అందుకే సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. ఇలాంటి ఘటన మరో కుటుంబానికి జరగకూడదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో (ap assembly sessions) తన సతీమణిని దూషించారంటూ తెలుగు దేశం పార్టీ (telugu desam party) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) మీడియా సమావేశంలో బోరున విలపించడం.. రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై శనివారం నందమూరి కుటుంబ సభ్యలు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఆడవాళ్లపై మాటలు తూలితే చూస్తూ ఉరుకోమని హెచ్చిరంచారు. తమ కుటుంబం దేవాలయం లాంటిందని చెప్పారు. రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు గానీ.. ఇంట్లో ఉన్న ఆడవాళ్ల గురించి మాట్లాడటమేమిటనని మండిపడ్డారు.
ఇక, బాలకృష్ణ మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరమని అన్నారు. సభ సజావుగా జరగకుండా వ్యక్తిగత అంశాలు తీసుకొచ్చి దృష్టి మళ్లిస్తున్నారని విమర్శించారు. తన చెల్లెలు భువనేశ్వరిపై (nara bhuvaneshwari) వ్యక్తిగత దాడి దురదృష్టకరమని అన్నారు. వ్యక్తిగత దూషణలు సరికావని హితవు పలికారు. గోడ్ల చావిట్లో ఉన్నామా..? అసెంబ్లీలో ఉన్నామా..? అని ప్రశ్నించారు. రాజకీయాలతో సంబంధం లేని వారిపై వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో ఎంతో మేధావులు ఉన్నారు.. కానీ ఇంత నీచానికి పాల్పడటం ఏమిటని ప్రశ్నించారు. తాను ఒక శాసనసభ్యుడినని తన మీదకు రావచ్చొని.. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ల మీదకు రావడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికి తల్లులు, భార్యలు, పిల్లలు ఉన్నారని, పర్సనల్‌గా టార్గెట్ చేస్తే చేతులు ముడుచుకుని కూర్చోమని హెచ్చరించారు.
తన చెల్లి హెరిటేజ్ నడుపుతుందని.. సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. వాళ్లలో ఎవరైనా ఇలా చేసారా అని ప్రశ్నించారు. దోచుకున్న సొమ్ము అంతా ఇంట్లోకి చేర్చడమే వాళ్ల పని అని మండిపడ్డారు. వాళ్ల ఇంట్లో ఆడవాళ్లు కూడా చీదరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
తాము వ్యక్తిగతంగా ఎప్పుడూ ఎవరిని విమర్శలు చేయలేదని అన్నారు. గోడ్ల చావిట్లో ఉన్నామా..? అసెంబ్లీలో ఉన్నామా..? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకోవడం సాధారణంగా జరుగుతుందని.. రాజకీయాలతో సంబంధం లేని వారిపై మాటల దాడి సరికాదని అన్నారు. ఏకపక్షంగా శాసనసభను నడుపుతున్నారని.. బాలకృష్ణఏపీ ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. మంచి సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం లేదన్నారు.
Also Read: Chandrababu Naidu: ప్రెస్‌మీట్‌లో బోరున విలపించిన చంద్రబాబు నాయుడు.. వెక్కి వెక్కి ఏడ్చిన వైనం
చంద్రబాబు చెప్పడం వల్లే ఇన్నాళ్లూ సహనంగా ఉన్నాయమని.. ఇకపై నోరు తెరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఆడవాళ్లను తెరపైకి తెచ్చి మైండ్‌గేమ్ ఆడుతున్నారని మండిపడుతున్నారు. వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేశారని విమర్శించారు. రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని బాలకృష్ణ అన్నారు. వీర్రవీగి మాట్లాడేవారు నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. మారకపోతే మెడలు వంచి మారుస్తామని హెచ్చరించారు. మెజారిటీ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే ఉరుకునేది లేదని అన్నారు. దేనికైనా సరే ఒక హద్దు ఉంటుందని అన్నారు. మళ్లీ ఇలాంటి నీచమైన పదాలు వాడితే భరతం పడతామని వార్నింగ్ ఇచ్చారు. ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని సూచించారు. సీఎం కొడుకుగా కానీ... సీఎంకు బావమరిదిగానూ తానేప్పుడూ వ్యవహరించలేదని చెప్పారు. మమ్మల్ని అడ్డుకునే ఎలాంటి కుట్రలనైనా తిప్పికొడతామని హెచ్చరించారు. కులాలు, మతాల పేరిట సమాజాన్ని చీల్చి ఓట్లు సాధించారని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయో చూస్తునే ఉన్నామని బాలకృష్ణ తెలిపారు.