Asianet News TeluguAsianet News Telugu

డిల్లీ నుండి దిగగానే... విమానాశ్రయంలోనే లోకేష్ అరెస్ట్ : అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు (వీడియో)

మాజీ సీఎం చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినట్లే మాజీ మంత్రి నారా లోకేష్ అరెస్ట్ కు కూడా జగన్ సర్కార్ రంగం సిద్దం చేసిందని టిడిపి సీనియర్ నేత అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేసారు. 

TDP Leader Ayyannapatrudu sensational comments on Nara Lokesh Arrest AKP VSP
Author
First Published Sep 21, 2023, 4:25 PM IST | Last Updated Sep 21, 2023, 4:38 PM IST

విశాఖపట్నం : అక్రమ కేసులు పెట్టి  మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసినట్లే ఆయన తనయుడు లోకేష్ ను కూడా అరెస్ట్ చేయనున్నారంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం దేశ రాజధాని న్యూడిల్లీలో వుంటూ తండ్రి అక్రమ అరెస్ట్ పై  పోరాటం చేస్తున్న లోకేష్ రాష్ట్రంలో అడుగుపెట్టగానే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దంచేసారని అన్నారు. విమానాశ్రయంలోనే లోకేష్ ను అరెస్ట్ చేయవచ్చని అన్నారు. అయితే తండ్రిలాగే లోకేష్ కూడా జైలుకు వెళ్లడానికి రెడీగా వున్నారని అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. 

చంద్రబాబు, లోకేష్ కు రోజురోజుకు ప్రజాదరణ మరింత పెరుగుతోంది... దీంతో జగన్ కు ఓటమి భయం పట్టుకుందని అయ్యన్న అన్నారు. ఎలాగైనా వారిని ప్రజల్లో తిరగనివ్వకుండా చేయాలని సీఎం చూస్తున్నారని... అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపడం అందులో భాగమేనని అన్నారు. లోకేష్ ను కూడా జైల్లో పెడితే ఆయన భార్య బ్రహ్మణిని ముందుపెట్టి ఊరుఊరు తిరుగుతాం... రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డిని రాజకీయ సమాధి కడతామని అయ్యన్న హెచ్చరించారు. 

వీడియో

టిడిపి ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువత నైపుణ్యాభివృద్ది కోసమే స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటుచేసిందని అయ్యన్న పేర్కొన్నారు. గుజరాత్ ఒక బృందాన్ని పంపి అక్కడ నైపుణ్యాభివృద్ధి సంస్థలపై స్టడీ చేసామని... అలాంటివే ఏపీలో కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అప్పుడే సీమెన్స్ కంపనీ ముందుకు వచ్చిందన్నారు. ఆ కంపనీ 90 శాతం, ప్రభుత్వం 10 శాతం వాటాతో రాష్ట్రవ్యాప్తంగా 40 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసామన్నారు. ఇలా ఇడుపులపాయలో కూడా ఒకటి పెట్టామన్నారు. అలాంటిది చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ పేరిట రూ.270 కోట్లు తినేశాడని అనడానికి సిగ్గు లేదా.. అంటూ అయ్యన్న మండిపడ్డారు. 

Read More  చంద్రబాబును అరెస్ట్ చేసిన ప్రదేశంలో ఆమరణ దీక్ష చేస్తా.. చావడానికైనా సిద్దమే: అఖిలప్రియ

తప్పుడు కేసుల్లో ఇరికించి చంద్రబాబును 73 ఏళ్ళ వయసులో ఇబ్బంది పెడుతున్నారని అయ్యన్న ఆందోళన వ్యక్తం చేసారు. ఏం పాపం చేసాడని ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు. తనకు బెయిల్ వద్దని... తనపై పెట్టింది తప్పుడు కేసు అని తేలిన తర్వాత బయటకు వస్తానని చంద్రబాబు అంటున్నారని తెలిపారు. కోర్టు తనను నిర్దోషిగా తేల్చి వదిలిపెట్టేవరకు జైల్లోనే వుంటానని చంద్రబాబు అంటున్నారని మాజీ మంత్రి తెలిపారు. 

గత ఎన్నికల సమయంలో మహిళల ఓట్లకోసమే మధ్యపాన నిషేదం హామీ ఇచ్చారని అయ్యన్న అన్నారు. ఇప్పుడేమో  25 సంవత్సరాలు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి భారీగా అప్పులు తెచ్చారని అన్నారు. మరో ఆరు నెలల్లో జగన్ జైలుకు వెళ్లడం ఖాయం... మరి ఈ అప్పులు ఎవరు తీరుస్తారు? అంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేసారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios