మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావుని గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వస్తుండగా... పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. అనంతరం హౌస్ అరెస్టు చేశారు. ధర్నాలకు అనుమతి లేదంటూ పోలీసులు దేవినేని ఉమాకి నోటీసులు జారీ చేశారు. శాంతియుతంగా ధర్నా చేసేవారిని హౌస్ అరెస్టు చేయడం దారుణమని, పోలీసులను అడ్డంపెట్టుకొని సీఎం జగన్ ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. 

చాలా మంది టీడీపీనేతలను హౌస్ అరెస్టు చేశారని మండిపడ్డారు. అందరికీ అందుబాటుల ఉండే విధంగా ఇసుక పాలసీని తీసుకురావాలని ఈ సందర్భంగా దేవినేని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఇబ్బందులపై ఆందోళనలు చేయడానికి టీడీపీ శ్రేణులు  పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా... మరోవైపు ఏలూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని కూడా అడ్డుకున్నారు. ఆయనను కూడా హౌస్ అరెస్టు చేశారు. ఇసుక ధరలు రాష్ట్రంలో అమాంతం పెరగడంపై ప్రతిపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. మంగళగిరిలో మాజీ మంత్రి, టీడీపీ నేత లోకేష్ అధ్యక్షతన ఆందోళన చేపడుతున్నారు.