సారాంశం

వైసీపీ ప్రభుత్వం ఇసుక విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇసుక కొరతపై శుక్రవారం టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 

వైసీపీ ప్రభుత్వం ఇసుక విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇసుక కొరతపై శుక్రవారం టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పాలకొల్లులో నిమ్మల నిరసనకు దిగారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసి యలమంచిలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ధర్నాలో పాల్గొనడానికి వెళుతున్న టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ను సైతం అరెస్ట్ చేసి తొలుత పోడూరు పీఎస్‌కి అక్కడి నుంచి యలమంచిలికి తరలించారు. వీరి అరెస్ట్ విషయం తెలుసుకున్న తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఠాణాకు చేరుకుని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఎమ్మెల్యేకు మద్ధతుగా స్టేషన్ ఎదుట బైఠాయించారు. అక్కడితో ఆగకుండా పీఎస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.