Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రప్రదేశ్ స్కిల్ కేసు: బాబు పిటిషన్‌పై తీర్పును వెల్లడించనున్న సుప్రీం


తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల  16న తీర్పు వెల్లడించనుంది ఉన్నత న్యాయస్థానం.

Supreme Court to deliver Verdict  on Chandrababu petition lns
Author
First Published Jan 13, 2024, 6:05 PM IST


 న్యూఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన  పిటిషన్ పై  సుప్రీంకోర్టు  ఈ నెల  16న తీర్పును వెల్లడించనుంది. 

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై  17 ఏ సెక్షన్ చుట్టూనే వాదనలు జరిగాయి. సెక్షన్  17 ఏ  తనకు వర్తిస్తుందని చంద్రబాబు  తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో చంద్రబాబుకు  17 ఏ సెక్షన్ వర్తించదని  ఏపీ సీఐడీ తరపున న్యాయవాదులు వాదనలు విన్పించారు. ఈ విషయమై  రాతపూర్వకమైన వాదనలు విన్పించేందుకు  కూడ సుప్రీంకోర్టు సమయం ఇచ్చిన విషయం తెలిసిందే.  సుప్రీంకోర్టు జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ నెల  16న ఈ విషయమై  తీర్పును వెల్లడించనుంది.

also read:చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డిన్నర్ భేటీ: సీట్ల సర్ధుబాటుపై చర్చ

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  17 ఏ సెక్షన్ ను ఉల్లంఘించారని  చంద్రబాబు  తరపు న్యాయవాదులు వాదించారు.  . ఫైబర్ నెట్ కేసులో  చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. 

also read:జనసేనలోకి ముద్రగడ?: కిర్లంపూడిలో పద్మనాభంతో భేటీకి పవన్

ఈ కేసులో కూడ  17 ఏ సెక్షన్ గురించి  అప్పట్లో  చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రస్తావించారు.  స్కిల్ కేసులో 17 ఏ సెక్షన్ వర్తిస్తుందా లేదా అనే విషయమై  సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించిన తర్వాత ఫైబర్ నెట్ కేసుపై విచారణ జరుపుతామని  సుప్రీంకోర్టు ధర్మాసనం అప్పట్లో ప్రకటించింది. 

also read:మాగుంటతో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం భేటీ: ఏం జరుగుతుంది?

ఇదిలా ఉంటే ఐఆర్ఆర్, మద్యం కేసు, ఉచిత ఇసుక కేసుల్లో  చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ  ఈ నెల  10వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios