మాగుంటతో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం భేటీ: ఏం జరుగుతుంది?
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో అనుచరులు భేటీ అవుతున్నారు.
విజయవాడ: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం శనివారం నాడు భేటీ అయ్యారు. ఒంగోలు ఎంపీ టిక్కెట్టు విషయమై వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం ఇంకా తేల్చలేదు.దీంతో అనుచరులతో మాగుంట శ్రీనివాస్ రెడ్డి సమావేశమౌతున్నారు. ఈ సమయంలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం భేటీ అయ్యారు. ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.
ఒంగోలు ఎంపీ స్థానాన్ని ఈ దఫా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కాకుండా మాజీ ఎంపీ వై.వీ. సుబ్బారెడ్డి లేదా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కు ఇవ్వాలని వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఒంగోలు ఎంపీ సీటును మరోసారి మాగుంట శ్రీనివాసులు రెడ్డికే ఇవ్వాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పట్టుబడుతున్నారని వైఎస్ఆర్‌సీపీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఒంగోలు ఎంపీ సీటు విషయమై నాలుగు జాబితాలో స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు.
also read:వైఎస్ఆర్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు: బాబుతో భేటీ తర్వాత షర్మిల
ఒకవేళ వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు దక్కకపోతే ఏం చేయాలనే దానిపై మాగుంట శ్రీనివాసులు రెడ్డి అనుచరులతో చర్చిస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు దక్కకపోతే ప్రత్యామ్నాయాలపై చర్చిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. అనుచరులతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.
also read:సీఎం అభ్యర్ధిగా చిరంజీవి: కాంగ్రెస్ నేత చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో జగన్ వ్యూహా రచన చేస్తున్నారు.ఈ క్రమంలోనే గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అయితే ఒంగోలు ఎంపీ సీటు విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. సంక్రాంతి తర్వాత వైఎస్ఆర్‌సీపీ నాలుగో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు జాబితాల్లో 61 స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. నాలుగో జాబితాలో కూడ మరికొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకొనే అవకాశం ఉంది.
also read:జనసేనలోకి ముద్రగడ: కిర్లంపూడిలో పద్మనాభంతో భేటీకి పవన్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం, జనసేనలు కలిసి పోటీ చేయనున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని వైఎస్ఆర్‌సీపీ ప్రకటించింది. వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకోవాలనే వ్యూహంతో వైఎస్ఆర్‌సీపీ ముందుకు వెళ్తుంది.