కృష్ణాజిల్లా దివిసీమ ప్రాంతం కొద్దిరోజుల క్రితం పాముల స్వైర విహారంతో వణికిపోయిన సంగతి తెలిసిందే. రోజూ పదుల సంఖ్యలో జనం పాముకాటుకు గురికావడంతో అవనిగడ్డ ఏరియా ఆసుపత్రి బాధితులతో నిండిపోయింది.

పాముల బెడదను నివారించేందుకే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగాల్సి  వచ్చింది. అంతేకాకుండా పాములు తమను బాధించకుండా మోపిదేవిలోని సుబ్రమణ్యేశ్వర స్వామి దేవాలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు సైతం చేశారు.

కొద్దికాలం నిశ్శబ్ధంగా ఉన్న సర్పరాజాలు మరోసారి బుస కొట్టాయి. ఇవాళ ఉదయం అవనిగడ్డలో పాములు సంచరించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తమకు కనిపించిన పిల్లపామును జనం కొట్టిచంపడంతో.. దాని తల్లి రెచ్చిపోయింది.

కోపంతో బుసలు కొడుతూ..కనిపించిన వారిని కాటేసేందుకు ఉరుకులు, పరుగులు పెట్టింది. దీంతో ఆ తల్లిపామును కూడా కొందరు యువకులు కొట్టి చంపారు. ఉదయం నుంచి సుమారు 7 పాములను చంపినట్లుగా సమాచారం. మరోవైపు ఈ పాములన్నీ విషపూరితం కావని.. స్నేక్ ఫ్రెండ్స్ క్లబ్ ప్రతినిధులు చెబుతున్నారు... అయినప్పటికీ జనం కనిపించిన సర్పాన్ని కనిపించినట్లు చావ గొడుతున్నారు. 

దివిసీమను వదలని పాములు.. ఒక్క రోజులో 10 మందికి పాము కాటు

దివిసీమను వణికిస్తున్న పాములు.. మోపిదేవి ఆలయంలో జనాల పూజలు

కేరళ వరదలు: స్నేక్ అలర్ట్, ఇళ్లలో పొంచిన ఉన్న పాములు

ఎర్ర చందనం స్మగ్లర్ చిట్కా: పాములు దగ్గరికి రావద్దంటే...

కేరళ.. ఇళ్లల్లోకి పాములు.. ఇప్పుడు వాళ్లే అవసరం

కేరళలో తగ్గుముఖం పట్టిన వరదలు: ఇళ్లలోకి చేరిన పాములు, మొసళ్లు

పెద్దలు జానారెడ్డి ప్రెస్‌మీట్.. పక్కనే జంట పాములు