Asianet News TeluguAsianet News Telugu

దివిసీమను వణికిస్తున్న పాములు.. మోపిదేవి ఆలయంలో జనాల పూజలు

వర్షాకాలం కావడం.. వాగులు వంకలు పొటెత్తుతుండటంతో ఆ వరద నీటితో పాటు.. చెట్లు చిగురించడంతో దివిసీమలో విష సర్పాల తాకిడి ఎక్కువైంది. గడిచిన 10 రోజుల్లో వందల మంది జనాలు పాము కాటుకు గురయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు

snake alert on diviseema
Author
Mopidevi, First Published Aug 27, 2018, 11:41 AM IST

వర్షాకాలం కావడం.. వాగులు వంకలు పొటెత్తుతుండటంతో ఆ వరద నీటితో పాటు.. చెట్లు చిగురించడంతో దివిసీమలో విష సర్పాల తాకిడి ఎక్కువైంది. గడిచిన 10 రోజుల్లో వందల మంది జనాలు పాము కాటుకు గురయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

పాము కాటుకు గురైన వారితో అవనిగడ్డ ఏరియా ఆసుపత్రి నిండిపోయింది. ఈ ఒక్క వారంలోనే 40 మంది వరకు చావు అంచుల దాకా వెళ్లొచ్చారు. పరిస్థితిని అంచనా వేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం.. దివిసీమకు ప్రత్యేక వైద్య బృందాలతో  పాటు అవసరమైన మందులను పంపుతోంది. విష సర్పాలను అడ్డుకునే చర్యలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.

మరోవైపు ఈ ఆపద నుంచి తమను గట్టెక్కించాల్సిందిగా జనాలు కూడా పూజలు, హోమాలు చేస్తున్నారు. దివిసీమలోని ప్రముఖ దేవాలయం మోపిదేవి సుబ్రమణ్య స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. 

దీనికి సంబంధించిన వార్తల కోసం ఈ లింకులు క్లిక్ చేయండి:

పాముకాటుకు మరో ఇద్దరు రైతుల బలి....22 రోజుల్లో 85 మందికి పాముకాట్లు

ఆలయంలో 15 పాముల కలకలం....నాగుపాము, తాడిజెర్రి, కట్లపాము... అన్నీ విషసర్పాలే

ఎర్ర చందనం స్మగ్లర్ చిట్కా: పాములు దగ్గరికి రావద్దంటే...

 

 

Follow Us:
Download App:
  • android
  • ios