తెలంగాణ అసెంబ్లీలో పాముల సంచారం పెనుకలకలం రేపింది. గద్వాల జిల్లాలో కేసీఆర్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే సంపత్ కుమార్ హౌస్ అరెస్ట్‌తో పాటు ముందస్తు ఎన్నికల గురించి సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతుండగా.. అసెంబ్లీ మీడియా హాలు పక్కనే జంట పాముల సయ్యాటలాడుతూ కనిపించాయి. వీటిని చూసిన కొందరు వెంటనే వాటిని పట్టుకున్నారు..

అప్పటికే హాలులో జర్నలిస్టులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. కాగా, అసెంబ్లీలో తరచూ పాములు తిరుగుతున్నాయన్న పలువురు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాముల సయ్యాటలాడుతుండగా కొందరు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయ్యింది.