Asianet News TeluguAsianet News Telugu

కేరళ వరదలు: స్నేక్ అలర్ట్, ఇళ్లలో పొంచిన ఉన్న పాములు

వరదలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేరళలో ప్రభుత్వం స్నేక్ అలర్ట్ ప్రకటించింది. ఆస్పత్రుల్లో పాము కాటు విరుగుడు మందులను అందుబాటులో ఉంచింది. ఇళ్లలోని కప్ బోర్డుల్లో, బ్లాంకెట్స్ కింద, దుస్తుల్లో, వాషింగ్ మిషన్ల కింద ఎక్కడైనా పాములు ఉండవచ్చునని ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది.

Flood-hit Kerala issues 'snake alert'
Author
Kerala, First Published Aug 25, 2018, 11:40 AM IST

త్రివేండ్రం: వరదలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేరళలో ప్రభుత్వం స్నేక్ అలర్ట్ ప్రకటించింది. ఆస్పత్రుల్లో పాము కాటు విరుగుడు మందులను అందుబాటులో ఉంచింది. ఇళ్లలోని కప్ బోర్డుల్లో, బ్లాంకెట్స్ కింద, దుస్తుల్లో, వాషింగ్ మిషన్ల కింద ఎక్కడైనా పాములు ఉండవచ్చునని ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది.

వరద తాకిడికి గురైన పలు ఇళ్లలో ఇప్పటికే పాములు కనిపిస్తున్నాయి. ఇళ్లకు తిరిగి వెళ్లిన సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది. 

పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆస్పత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. పాము కాటు బాధితులకు వెంటనే చికిత్స అందించడానికి సిద్ధం కావాలని ఆస్పత్రుకు తెలియజేసింది. ఆస్పత్రుల్లో అవసరమైన పాము కాటు విరుగుడుకు అవసరమైన మందులను ఏర్పాటు చేసింది. 

పాముల కాట్లకు గురై ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది ఇళ్లలో పాములను పట్టుకోవడానికి రాష్ట్ర అధికారులు, వన్యప్రాణుల నిపుణులు బృందాలుగా ఏర్పడ్డారు. ఇంకా పది లక్షల మంది సహాయ శిబిరాల్లోనే ఉన్నట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios