Asianet News TeluguAsianet News Telugu

మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం... విజయవాడలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు

స్పా, మసాజ్ సెంటర్ల ముసుగులో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. అమ్మాయిలతో క్రాస్ మసాజ్ పేరిట విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తోంది ఈ మఠా. 

Prostitution racket busted in Vijayawada
Author
First Published Dec 13, 2022, 10:07 AM IST

విజయవాడ : స్పా సెంటర్ ముసుగులో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా విజయవాడ పోలీసులకు చిక్కింది. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో కె స్టూడియో స్పా లో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో దానిపై దాడి చేసారు. దీంతో వ్యభిచార రాకెట్ గుట్టు రట్టయ్యింది. దీంతో స్పా సెంటర్ నిర్వహకులతో పాటు కొందరు అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇటీవల విజయవాడ పోలీసులు స్పా సెంటర్లలో వ్యభిచారం జరగుతున్న గుర్తించి నగరంలోని స్పాలు, మసాజ్ సెంటర్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇలా మొత్తం రెండువందలకు పైగా స్పా, ఫిట్ నెస్, వెల్ నెస్, హెల్త్ సెంటర్లలో తనిఖీలు చేపట్టి 19 కేంద్రాల్లో వ్యభిచార దందా సాగుతున్నట్లు గుర్తించారు. ఇలా గలీజ్ దందా చేపట్టిన సెంటర్లను సీజ్ చేసి యాజమాన్యాలపై కేసులు నమోదు చేసారు. 

Read More  ఈ దేశంలో సెక్స్ వర్కర్ల సంపాదన ఎంతో తెలుసా..వాళ్లు కట్టే పన్నులతో ప్రభుత్వానికి బోలెడు ఆదాయం, ఎక్కడంటే..

చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన అమ్మాయిలనే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన అమ్మాయిలను తీసుకువచ్చి స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు  గుర్తించినట్లు విజయవాడ పోలీసులు తెలిపారు. ఇకపైనా స్పా, మసాజ్ సెంటర్లపై నిత్యం నిఘా వుంచుతామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో స్పా సెంటర్ లో వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios