ఉల్లిపాయ పై నిమ్మరసం పిండుకొని తింటున్నారా..? ఏమౌతుందో తెలుసా?
ఉల్లిపాయ తినడం వల్ల.. ఒంట్లో వేడి మొత్తం తగ్గిపోతుంది. అదే ఉల్లిపాయ మీద నిమ్మరసం పిండి తీసుకోవడం వల్ల... ఆ ప్రయోజనాలు మరింత రెట్టింపు అవుతాయి.
భోజనం చేస్తున్న సమయంలో ముఖ్యంగా బిర్యానీ తింటున్నప్పుడు చాలా మందికి ఉల్లిపాయ తినే అలవాటుు ఉంటుంది. ఆ ఉల్లిపాయను మామూలుగా తినం.. దానిపై నిమ్మరసం పిండుకొని మరీ చాలా మంది తింటూ ఉంటారు. అయితే... ఇలా తినొచ్చా తినకూడదా అనే సందేహం మీకు ఏమైనా ఉందా..? ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి. ఎందుకంటే... ఇలా ఉల్లిపాయపై నిమ్మరసం పిండుకొని తినడం వల్ల.... మీరు ఊహించని చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం...
ముఖ్యంగా, ఈ ఎండాకాలం వేడిని తట్టుకోవడం మనకు చాలా కష్టంగా ఉంటుంది. ఈ వేడిని తట్టుకోవడానికి మనం ఉల్లిపాయ తినడం చాలా మంచిది. ఉల్లిపాయ తినడం వల్ల.. ఒంట్లో వేడి మొత్తం తగ్గిపోతుంది. అదే ఉల్లిపాయ మీద నిమ్మరసం పిండి తీసుకోవడం వల్ల... ఆ ప్రయోజనాలు మరింత రెట్టింపు అవుతాయి.
ఉల్లిపాయలో అల్లీసిన్ ఉంటుంది. ఇది శరీరానికి మేలు చేస్తుంది. దీనిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకం నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గించడంలోనూ కీలకంగా పని చేస్తుంది.
ఇక వేసవిలో ఉల్లిపాయను సలాడ్ రూపంలో తీసుకోవాలి. ఇది మరింత ఆరోగ్యంగా ఉండానికి నిమ్మరసం, పచ్చిమిర్చి చేర్చితే సరిపోతుంది. ఈ నిమ్మకాయ రసం కలిపిన ఉల్లిపాయను మధ్యాహ్న భోజన సమయంలో తినాలి. ఉల్లికి నిమ్మరసం జోడించడం వల్ల.. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. పేగు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.
ఎండాకాలంలో చాలా మందికి గ్యాస్, అజీర్ణ సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఉల్లిపాయకు నిమ్మరసం చేర్చాల్సిందే. ఉల్లిపాయలో ప్రీబయోటిక్ ఇనులిన్ ఫ్రక్టోలిగోసాకరైడ్లు కనిపిస్తాయి. నిమ్మకాయతో కలిపి తింటే... అది హీట్ స్ట్రాక్ నుంచి మనల్ని కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఉల్లిపాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ కి కూడా మేలు చేస్తుంది.